News September 9, 2024
ఇవాళ ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ప.గో, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. బాపట్ల జిల్లాలోని కొన్ని మండలాలకు హాలిడే ప్రకటించారు. సెలవు ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Similar News
News August 17, 2025
రవితేజ ‘మాస్ జాతర’ విడుదల వాయిదా?

మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 27న రిలీజ్ కావాల్సిన ఈ మూవీని అక్టోబర్ 20కి పోస్ట్పోన్ చేస్తారని సమాచారం. సినీ కార్మికుల సమ్మె వల్ల పెండింగ్ వర్క్ పూర్తి కాలేదని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.
News August 17, 2025
సీఎంతో పీసీసీ చీఫ్ భేటీ

TG: సీఎం రేవంత్ రెడ్డితో ఈ ఉదయం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సందిగ్ధత, ఎన్నికల నిర్వహణకు కోర్టు విధించిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల నిర్వహణపై ఓ క్లారిటీ వచ్చేందుకు కీలకంగా భావిస్తున్న PAC సమావేశం తేదీ ఖరారుపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం.
News August 17, 2025
చికెన్ బోన్స్ తింటున్నారా?

చాలామంది చికెన్తో పాటు ఎముకలను నమిలేస్తుంటారు. బోన్స్ తింటే జీర్ణ సమస్యలు రావొచ్చని, కృత్రిమంగా పెరిగిన కోళ్ల ఎముకలతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి జీర్ణమయ్యేందుకు టైమ్ పడుతుందని, పేగులలో అడ్డంకులు ఏర్పడొచ్చని అంటున్నారు. ఎముకలు అన్నవాహిక, శ్వాసనాళంలో చిక్కుకునే అవకాశముంటుందని, శ్వాసనాళంలో ఇరుక్కుపోతే ఊపిరాడక ఇబ్బంది ఎదురవ్వొచ్చని పేర్కొంటున్నారు. SHARE IT.