News September 10, 2024
ఈ జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు

AP: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అల్లూరి జిల్లా వ్యాప్తంగా ఇవాళ స్కూళ్లకు సెలవు ఇచ్చారు. అటు వర్షం ఎఫెక్ట్ ఉన్న ఏలూరు జిల్లాలో భీమడోలు, పెదపాడు, మండవల్లి, కైకలూరు, ఏలూరు, ముదినేపల్లి, కలిదిండి మండలాల్లోని పలు పాఠశాలలకు అధికారులు సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా స్కూళ్లు యథాతథంగా నడవనున్నాయి.
Similar News
News October 21, 2025
ప్రసారభారతిలో 59 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News October 21, 2025
స్వాతంత్య్ర సంగ్రామంలో సువర్ణ అధ్యాయం: ఆజాద్ హింద్ ఫౌజ్

భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఈరోజు ఎంతో కీలకం. 1943లో సరిగ్గా ఇదే రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ సింగపూర్‌లో ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి, తాత్కాలిక స్వతంత్ర ప్రభుత్వాన్ని ప్రకటించారు. నేతాజీ నాయకత్వంలో వేలాది మంది సైనికులు దేశం కోసం తుదిశ్వాస వరకు పోరాడారు. ‘చలో ఢిల్లీ’ నినాదంతో బ్రిటిష్ పాలకుల గుండెల్లో భయం పుట్టించిన ఈ సైన్యం సాహసాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం. *జై హింద్
News October 21, 2025
ట్రంపే కాదు.. ఆయన సెక్రటరీ అంతే!

US ప్రెసిడెంట్ ట్రంప్ నోటి దురుసు గురించి తెలిసిందే. ఈ విషయంలో తానేం తక్కువ కాదని వైట్‌హౌస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ నిరూపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించేందుకు త్వరలో ట్రంప్, పుతిన్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో భేటీ కానున్నారు. ఈ హైలెవెల్ సమ్మిట్‌కు ఆ లొకేషన్ ఎవరు ఎంపిక చేశారని ఓ జర్నలిస్ట్ కరోలిన్‌కు మెసేజ్ చేశారు. ‘మీ అమ్మ చేసింది’ అని ఆమె బదులివ్వడంతో విమర్శలు వెల్లువెత్తాయి.