News December 12, 2024

నేడు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సెలవు

image

AP: భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎవరైనా తరగతులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా తిరుపతిలో ఇవాళ భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Similar News

News October 14, 2025

పొద్దుతిరుగుడులో తెగుళ్ల నివారణకు ఇలా..

image

వరి కోతల తర్వాత పొద్దుతిరుగుడు పంటను సాధారణ దుక్కి పద్ధతిలో నవంబర్, డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. పంట తొలి దశలో చీడపీడలు, నెక్రోసిస్ వైరస్ తెగులు నివారణకు ఒక కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 3.గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5ML కలిపి శుద్ధి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 2-3టన్నుల పశువుల ఎరువు వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఎకరాకు 30KGల నత్రజని, 36KGల భాస్వరం, 12KGల పొటాషియం వేసుకోవాలి.

News October 14, 2025

విజయానికి 58 పరుగుల దూరంలో..

image

వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ చివరి రోజు ఆట ప్రారంభమైంది. భారత్ గెలవడానికి మరో 58 రన్స్ అవసరం. దీంతో తొలి సెషన్‌లోనే ఇండియా విజయం సాధించే అవకాశం ఉంది. క్రీజులో రాహుల్(25), సుదర్శన్(30) ఉన్నారు. భారత్ ఈ మ్యాచులో గెలిస్తే రెండు టెస్టుల సిరీస్‌ క్లీన్‌స్వీప్ అవుతుంది.

News October 14, 2025

ట్రంప్‌కు 2026లోనైనా ‘శాంతి’ దక్కేనా?

image

8 యుద్ధాలు ఆపానని, తన కంటే అర్హుడు మరొకరు లేరని ఓ మినీ సైజ్ యుద్ధం చేసినా ట్రంప్‌కు 2025-నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. తాజాగా ఇజ్రాయెల్‌, పాక్ ఆయన్ను ఆ ప్రైజ్‌కు నామినేట్ చేశాయి. గడువులోగా నామినేషన్లు రాక ట్రంప్ పేరును నోబెల్ కమిటీ పరిగణనలోకి తీసుకొని విషయం తెలిసిందే. వచ్చే JAN31 వరకు గడువు ఉండటంతో 2026 రేసులో ట్రంప్ ముందున్నట్లు తెలుస్తోంది. 2026లోనైనా పీస్ ప్రైజ్ ఆయన్ను వరిస్తుందా? మీ COMMENT.