News September 7, 2025
నేడే చంద్ర గ్రహణం.. ఈ పనులు మానుకోండి

నేడు రాత్రి 9.58కి చంద్ర గ్రహణం మొదలుకానుంది. కానీ <<17628465>>సూతక కాల<<>> ప్రభావం మధ్యాహ్నం 12.57 నుంచే ఉంటుందని పండితులు చెబుతున్నారు. ‘ఈ సమయంలో ఆహారం తీసుకోవద్దు. వండుకోవద్దు. ముందే వండిపెట్టిన ఆహారంపై దర్భ గడ్డి/తులసి ఆకులు వేసి ఉంచాలి. లేదంటే కలుషితం అవుతుంది. గ్రహణ సమయంలో శుభకార్యాలు, పూజలు వద్దు. SEP 8, 1.26AMకి గ్రహణం ముగుస్తుంది. ఆ తర్వాత దానాలు చేస్తే విశిష్టమైన ఫలితాలు లభిస్తాయి’ అని సూచిస్తున్నారు.
Similar News
News September 7, 2025
ప్రశాంతంగా నిమజ్జనం.. అభినందించిన సీఎం

TG: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. 9 రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
News September 7, 2025
వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్?

వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయనకు <<17630461>>ఇండియా-ఏ<<>> కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పినట్లు సమాచారం. అండర్సన్-టెండూల్కర్ సిరీస్‌లో విఫలమైన కరుణ్ నాయర్ స్థానంలో శ్రేయస్‌ను ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా అక్టోబర్ 2 నుంచి 14 వరకు వెస్టిండీస్‌తో అహ్మదాబాద్, ఢిల్లీ వేదికగా టీమ్‌ఇండియా రెండు టెస్టులు ఆడనుంది.
News September 7, 2025
తిరుపతి లడ్డూ హైదరాబాద్‌లో

తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు అందజేసే పవిత్రమైన లడ్డూ ప్రసాదం అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఈ మహా ప్రసాదం హైదరాబాద్‌లో కూడా అందుబాటులో ఉంటుందని చాలామందికి తెలియదు. హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్‌లోని TTD ఆలయాల్లో 9AM నుంచి 5PM వరకు వీటిని విక్రయిస్తారు. ఒక్కో లడ్డూ ధర ₹50. ఒకరు ఎన్నైనా కొనుగోలు చేయవచ్చు. వివిధ కారణాలతో తిరుమల వెళ్లలేని వారికి ఇక్కడే లడ్డూ లభించడం ఎంతో ఆనందాన్నిస్తోంది.