News August 30, 2025
ఇవాళ స్కూళ్లకు సెలవు.. ఎక్కడంటే?

TG: భారీ వర్షాలు, వరదలు కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేశాయి. పరిస్థితులు ఇంకా కుదుటపడకపోవడంతో ఆ జిల్లాలో విద్యాసంస్థలకు ఇవాళ కూడా సెలవు ఉంది. మరోవైపు వర్షాల నేపథ్యంలో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో ఇవాళ పరీక్షలు వాయిదా పడ్డాయి. త్వరలోనే కొత్త తేదీలు వెల్లడిస్తామని JNTUH ప్రకటనలో తెలిపింది.
Similar News
News August 30, 2025
నా హత్యకు కుట్ర పన్నింది ఎవరో తేల్చాలి: కోటంరెడ్డి

AP: తన హత్యకు కుట్ర పన్నారు అన్న వార్తలపై నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి <<17554192>>శ్రీధర్ రెడ్డి<<>> స్పందించారు. ‘నన్ను చంపితే రూ.కోట్లు ఇస్తానని ఎవరు చెప్పారో పోలీసులు తేల్చాలి. YCP నేతలు, రౌడీ షీటర్ల బుడ్డ బెదిరింపులను నేను కాదు కదా.. నా మనవడు, నా మనవరాలు కూడా లెక్క చేయరు. ప్రతి మనిషికి ఏదో రోజు మరణం వస్తుంది. భయపడుతూ బతికే అలవాటు నాకు లేదు’ అని తెలిపారు.
News August 30, 2025
కుటుంబసభ్యులను కోల్పోయాం.. వారిని భర్తీ చేయలేం: RCB

బెంగళూరు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి RCB యాజమాన్యం తాజాగా పరిహారం ప్రకటించింది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున అందించినట్లు ట్వీట్ చేసింది. ‘RCB కుటుంబంలోని 11 మందిని కోల్పోయాం. వారు మనలో భాగం. ఎన్ని డబ్బులిచ్చినా వారి స్థానాన్ని భర్తీ చేయలేం. కానీ మొదటి అడుగుగా రూ.25లక్షలు ఇచ్చాం’ అని ట్వీట్ చేసింది. ఘటన జరిగిన 3 నెలల తర్వాత RCB ఈమేరకు స్వయంగా స్పందించింది.
News August 30, 2025
సభలో మాగంటి మృతిపై సంతాప తీర్మానం

TG: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గోపీనాథ్ సేవలను గుర్తు చేసుకున్నారు. వివిధ పదవులతో జూబ్లీహిల్స్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. మాగంటితో తనకున్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని సభలో సీఎం పంచుకున్నారు. ఆయన అకాల మరణం నియోజకవర్గ ప్రజలకు తీరని లోటన్నారు.