News August 14, 2025

నేడు బలరామ జయంతి.. ఎలా పూజించాలంటే?

image

శ్రావణ బహుళ షష్ఠి(నేడు) రోజున బలరామ జయంతిని జరుపుకుంటారు. ఉ.8గం.-ఉ.11గం. వరకు పూజకు మంచిదని పండితులు తెలిపారు. ఈరోజు బలరాముని పూజిస్తే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసం. ‘సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి బలరామకృష్ణుల పటాలకు గంధం, కుంకుమ పెట్టుకోవాలి. పారిజాత పూలు, శంఖు, పొగడ పూలతో పూజించాలి. పాలు, వెన్న, మీగడ, అటుకులు వంటి పదార్థాలతో నైవేద్యం సమర్పించాలి. ఉపవాసం ఉండాలి’ అని చెబుతున్నారు.

Similar News

News August 16, 2025

కాసేపట్లో భారీ వర్షాలు: TGiCCC

image

TG: కాసేపట్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ కమాండ్&కంట్రోల్ సెంటర్ హెచ్చరించింది. సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తెల్లవారుజామున 4 గంటల్లోపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ మేరకు ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజులు పంపింది.

News August 16, 2025

ఆగస్టు 16: చరిత్రలో ఈ రోజు

image

1919 : మాజీ సీఎం టంగుటూరి అంజయ్య జననం
1920 : మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి(ఫొటోలో) జననం
1970: మనీషా కొయిరాలా జననం
1989 : సింగర్ శ్రావణ భార్గవి జననం
1996 : వేద పండితులు, గాంధేయవాది చర్ల గణపతిశాస్త్రి మరణం
2001 : భారత భౌతిక, వాతావరణ శాస్త్రవేత్త అన్నా మణి మరణం

News August 16, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.