News December 4, 2024

నేడే చైతూ-శోభిత వివాహం

image

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహం ఈరోజు రాత్రి 8.13 గంటలకు జరగనున్న విషయం తెలిసిందే. దీనికోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేక సెట్‌ను ఏర్పాటు చేశారు. పూర్తి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగే ఈ వేడుకకు టాలీవుడ్ హీరోలు తమ కుటుంబంతో హాజరవుతారని సమాచారం. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరగ్గా దీనికి సంబంధించిన ఫొటోలు వైరలయ్యాయి.

Similar News

News April 7, 2026

రుషికొండ భవనాలు.. సిద్ధమైన తుది నివేదిక

image

AP: విశాఖలోని రుషికొండ భవనాల వినియోగంపై క్యాబినెట్ సబ్ కమిటీ తుది నివేదిక సిద్ధం చేసినట్లు మంత్రి దుర్గేశ్ తెలిపారు. వీటిని ప్రజల సందర్శనకు వినియోగించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చేందుకు చర్చించినట్లు వివరించారు. నిర్వహణ కోసం తాజ్, ఫెమా వంటి హోటల్ గ్రూపులు ఆసక్తి చూపుతున్న అంశంపైనా చర్చించామని పేర్కొన్నారు. నివేదికపై త్వరలో క్యాబినెట్ భేటీలో CMతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

News April 7, 2026

యవ్వనంగా ఉండాలా? సెలబ్రిటీల లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వండి!

image

మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకీ, కమల్ వంటి సీనియర్ హీరోలు 60 ఏళ్లు దాటినా క్రమశిక్షణతో కూడిన వ్యాయామంతో యవ్వనంగా కనిపిస్తున్నారు. అటు బాలీవుడ్‌లోనూ హృతిక్, శిల్పా శెట్టి, మలైకా అరోరా ఫిట్‌నెస్‌ను జీవనశైలిగా మార్చుకున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని వర్కౌట్స్ చేస్తూ ఆరోగ్యాన్ని <<19587777>>కాపాడుకోవాలి.<<>> వయసుతో సంబంధం లేకుండా చురుగ్గా ఉండొచ్చని వీరు నిరూపిస్తున్నారు.

News April 7, 2026

మీ డాష్ కామెంట్స్‌కి నేను ర్యాష్‌గా సమాధానం ఇవ్వలేను: రేవంత్

image

కేరళం సీఎం <<19590197>>విజయన్‌కు<<>> తన చివరి రెస్పాన్స్ అంటూ TG CM రేవంత్ తాజాగా మరో లేఖ విడుదల చేశారు. ‘మీరు వాడిన భాష మీ స్థాయికి తగ్గట్టుగా లేదు. అయినా మీ డాష్ కామెంట్స్‌కి నేను ర్యాష్‌గా సమాధానం ఇవ్వాలనుకోవడం లేదు. తీవ్ర కరవు, కరప్షన్, GSDP విషయంలో మీరు రిఫరెన్స్ ఇచ్చిన అంశాలన్నీ తప్పే. తెలంగాణ రైజింగ్ మా విజన్. నవ కేరళం కోసం ఎవరిని ఎన్నుకోవాలో త్వరలోనే ప్రజలు నిర్ణయిస్తారు’ అని తెలిపారు.