News August 7, 2024
భారత్కు ఇవాళ హార్ట్బ్రేకింగ్

ప్రపంచ వ్యాప్తంగా పలు క్రీడల్లో భారత్కు ఇవాళ తీవ్ర నిరాశ ఎదురైంది. పారిస్ ఒలింపిక్స్లో హోరాహోరీగా సాగిన హాకీ సెమీస్ జర్మనీ చేతిలో భారత్ 3-2 తేడాతో ఓడింది. రేపు స్పెయిత్తో కాంస్యం కోసం తలపడనుంది. అలాగే నిర్ణీత బరువుకన్నా 100gms అధికంగా ఉండటంతో అనర్హత వేటు పడి రెజ్లర్ వినేశ్ ఫైనల్ ఆడలేకపోయారు. దీంతో పతకం చేజారింది. అలాగే శ్రీలంకతో జరిగిన 3వ వన్డేలో ఓడిన భారత్ 27 ఏళ్ల తర్వాత సిరీస్ను కోల్పోయింది.
Similar News
News November 21, 2025
పల్నాడు వీరుల ఉత్సవాలలో నేడు మందపోరు

పల్నాడు వీరుల ఉత్సవాలలో మూడో రోజు శుక్రవారం మందపోరు నిర్వహించనున్నారు. మలిదేవ, బ్రహ్మన్న పరివారం అరణ్యవాస సమయంలో నల్లమల మండాది ప్రాంతంలో ఆవులను మేపేవారు. కుట్రతో నాగమ్మ వర్గీయులు ఆవులను వధిస్తారు. ఆవులు రక్షించుకునేందుకు లంకన్న భీకర యుద్ధం చేసి వీర మరణం పొందుతాడు. దీంతో బ్రహ్మనాయుడు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. నాడు కుల మతాలకు అతీతంగా బ్రహ్మనాయుడు చేపట్టిన చాప కూడు సిద్ధాంతం నేటికీ కొనసాగుతోంది.
News November 21, 2025
వేరుశనగలో తుప్పు/ కుంకుమ తెగులు – నివారణ

పెరిగిన చలి తీవ్రత, తేమ వాతావరణంతో వేరుశనగలో తుప్పు లేదా కుంకుమ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగు/ఎరుపు రంగు చిన్న చిన్న పొక్కులు ఏర్పడి, ఆకుల పైభాగంలో పసుపు మచ్చలు కనిపిస్తాయి. ఉద్ధృతి ఎక్కువైతే ఈ పొక్కులు మొక్క అన్ని భాగాలపై కనిపిస్తాయి. తుప్పు తెగులు కట్టడికి 200 లీటర్ల నీటిలో క్లోరోథలోనిల్ 400 గ్రా. లేదా మాంకోజెబ్ 400 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News November 21, 2025
పరమ పావన మాసం ‘మార్గశిరం’

మార్గశిర మాసం విష్ణువుకు అతి ప్రీతికరమైనది. ఈ మాసంలోనే దత్తాత్రేయుడు, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు వంటి దైవ స్వరూపులు అవతరించారు. పరాశరుడు, రమణ మహర్షి వంటి మహనీయులు జన్మించారు. భగవద్గీత లోకానికి అందిన పవిత్రమైన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ధనుర్మాసం ప్రారంభం, హనుమద్వ్రతం, మత్స్య ద్వాదశి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే ఉన్నాయి. అందుకే ఈ మాసం ఎంతో విశేషమైందని పండితులు చెబుతారు.


