News November 30, 2024
నేడు భారత్ VS పాకిస్థాన్ మ్యాచ్

అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. భారత జట్టుకు మహ్మద్ అమన్ సారథ్యం వహిస్తున్నారు. జట్టులో IPL వండర్ 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నారు. U19 ఆసియా కప్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు 3సార్లు తలపడగా భారత్ 2 సార్లు, పాక్ ఒకసారి గెలుపొందాయి. ఉదయం 10.30 గంటలకు సోనీ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ కానుంది. తొమ్మిదో టైటిల్ బరిలో భారత్ బోణీ కొట్టాలని చూస్తోంది.
Similar News
News February 4, 2026
మనలో ధైర్యాన్ని పెంచే ‘మూలాధార చక్రం’

వెన్నెముక చివరన ఉండే ఈ చక్రం మన మనుగడకు పునాది. ఇది సమతుల్యంగా ఉంటే ధైర్యం, ఆర్థిక స్థిరత్వం, సురక్షితమైన భావం కలుగుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది అస్థిరంగా ఉంటే భయం, అభద్రత, కాళ్ల నొప్పులు వేధిస్తాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి రోజూ ‘లం’ అనే మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేయాలి. ఎరుపు రంగు వస్తువులు వాడటం, నేలపై చెప్పులు లేకుండా నడవడం ద్వారా భూమితో సంబంధం పెంచుకుంటే ఈ చక్రం శక్తివంతమవుతుంది.
News February 4, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. DSP ప్రణీత్‌రావును డిమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. DSP నుంచి సీఐగా ప్రణీత్‌రావును డిమోట్ చేశారు. 2007 బ్యాచ్‌కు చెందిన ఆయన.. ట్యాపింగ్ కేసులో అరెస్ట్ తర్వాత సస్పెండయ్యారు. DSPని సీఐగా డిమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి.
News February 4, 2026
అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ డ్రోన్ దాడికి యత్నం

ఒకవైపు చర్చలకు సానుకూలంగా ఉన్నామని చెబుతూనే, తమ యుద్ధనౌకపైకి డ్రోన్ దాడి చేసేందుకు ఇరాన్ సిద్ధపడిందని అమెరికా ఆరోపించింది. అరేబియా సముద్రంలో ఉన్న ‘అబ్రహం లింకన్’ విమాన వాహక నౌకపైకి.. ఇరాన్‌కు చెందిన ‘షాహెద్ 139’ డ్రోన్ దూసుకొచ్చిందని, దాన్ని F-35 యుద్ధవిమానంతో కూల్చివేశామని అమెరికా అధికారులు తెలిపారు. ఈ వారం చివరిలో USA-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతాయని వార్తలు వెలువడ్డాయి.


