News July 7, 2024
నేడు పూరీ జగన్నాథుని రథయాత్ర

ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్ర నేడు జరగనుంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర తమ సింహాసనాలను వదిలేసి పెంచిన తల్లి గుండిచా దేవి వద్దకు ఈరోజు వెళ్తారని భక్తుల నమ్మిక. ఆ మేరకే విగ్రహాలను 3 కి.మీ దూరంలోని అమ్మ వద్దకు చేరుస్తారు. 1971 తర్వాత జగన్నాథ నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర ఒకేరోజు నిర్వహించడం ఇదే తొలిసారి. ఇక మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్రపతి ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాల్గొనున్నారు.
Similar News
News July 6, 2025
జులై 13 నుంచి వెబ్ ఆప్షన్లు

AP: EAPCET, ఫార్మసీ కాలేజీల వెబ్ ఆప్షన్ల నమోదును ఈ నెల 13 నుంచి నిర్వహించనున్నారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10 నుంచి జరగాల్సి ఉండగా, 13వ తేదీకి మార్చారు. ఇంజినీరింగ్ కాలేజీలకు యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు, ప్రభుత్వ అనుమతులు రావడానికి ఆలస్యం కారణంగానే వెబ్ ఆప్షన్ల నమోదు షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు.
News July 6, 2025
NFDBని అమరావతికి తరలించండి: చంద్రబాబు

AP: HYDలో ఉన్న జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు(NFDB)ను అమరావతికి తరలించాలని CM చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ‘గతంలో దేశ మత్స్య రంగంలో AP పాత్ర గుర్తించి ఈ బోర్డును HYDలో ఏర్పాటు చేశారు. రాష్ట్రం విడిపోయినా ఆక్వా ఉత్పత్తుల్లో APదే కీలక వాటా. రూ.19,420 కోట్ల ఎగుమతులతో దేశానికి నాయకత్వం వహిస్తోంది. సుదీర్ఘ తీరం, రొయ్యల పరిశ్రమ ఉన్న APలో దీని ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నాయి’ అని వివరించారు.
News July 6, 2025
148 ఏళ్లలో తొలిసారి.. చరిత్ర సృష్టించాడు

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో పరుగుల వరద పారించిన టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ <<16956685>>రికార్డుల<<>> మోత మోగించారు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే టెస్టులో 250 ప్లస్, 150 ప్లస్ రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా ఆయన ఖ్యాతి గడించారు. గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 269, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశారు. ఇక ఇంగ్లండ్‌పై ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, శతకం బాదిన తొలి ప్లేయర్‌గానూ అతడు రికార్డులకెక్కారు.