News February 4, 2025
నేడు రథసప్తమి.. ఇలా స్నానం చేయండి

ఈ ఏడాది మాఘ శుద్ధ సప్తమి ఇవాళ ఉ.7.53 నుంచి రేపు ఉ.5.30 వరకు ఉంది. నేడు ఉ.8 నుంచి మ.12 వరకు సూర్య భగవానుడి పూజకు మంచి సమయం. ఆదిత్యుడికి జిల్లేడు పత్రాలంటే ప్రీతి. ఉదయాన్నే రెండు భుజాలు, శిరస్సుపైన మూడు చొప్పున జిల్లేడు ఆకులను, వాటిపై కొద్దిగా బియ్యం ఉంచి స్నానం చేస్తే ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం. సూర్య కిరణాలు ప్రసరించే చోట రథం ముగ్గు వేసి భగవానుని పూజించాలి. పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
Similar News
News January 24, 2026
విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం: మంత్రి గొట్టిపాటి

AP: వచ్చే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఇప్పటికే యూనిట్కు 13 పైసలు ట్రూ డౌన్ చేశామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో యూనిట్పై రూ.1.19 తగ్గించి రూ.4కే ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికి యూనిట్ విద్యుత్ ఛార్జీ రూ.5.19 ఉండేదని, అందులో 29 పైసలు తగ్గించామని చెప్పారు. మరో 90 పైసలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.
News January 24, 2026
మహిళల ఆహారంలో ఉండాల్సిన పోషకాలివే..

ఒక మహిళ అమ్మగా, భార్యగా, ఉద్యోగినిగా, నాయకురాలిగా ఎన్నో పాత్రలు పోషించాల్సి ఉంటుంది. అందుకే ఆమె ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. మహిళల ఆహారంలో కచ్చితంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలంటున్నారు. వీటికోసం నట్స్, పాలకూర, ఓట్స్, పాల ఉత్పత్తులు, గుమ్మడి గింజలు, అవకాడో ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News January 24, 2026
800 ఉరిశిక్షలు ఆపానని ట్రంప్ ప్రకటన.. అంతా ఉత్తదేనన్న ఇరాన్

తన జోక్యంతో 800కు పైగా నిరసనకారుల <<18930505>>మరణశిక్షలు<<>> ఆగాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ స్పందించింది. అందులో నిజం లేదని స్పష్టంచేసింది. ‘ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం. ఆ స్థాయిలో మరణశిక్షలు లేవు. న్యాయవ్యవస్థ కూడా అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు’ అని ఇరాన్ టాప్ ప్రాసిక్యూటర్ మహ్మద్ మొవహేదీ చెప్పారు. కాగా ఇరాన్ వైపు యుద్ధ నౌకలు వెళ్తున్నాయని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే.


