News June 6, 2024

నేడు సునీల్ ఛెత్రీ ఆఖరి మ్యాచ్

image

భారత స్టార్ ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రీ నేడు తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నారు. కోల్‌కతాలో కువైట్‌తో జరగనున్న ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో ఆడి వీడ్కోలు పలకనున్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ ప్రపంచకప్ మూడో రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో ఆఖరి మ్యాచ్‌లో ఛెత్రి ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఛెత్రీ శకం నేటితో ముగియనుంది. ఈ మ్యాచ్ రాత్రి గం.7కు ప్రారంభమవుతుంది.

Similar News

News September 18, 2025

పాక్-సౌదీ మధ్య ఉమ్మడి రక్షణ ఒప్పందం

image

పాకిస్థాన్-సౌదీ అరేబియా దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇరు దేశాలు వ్యూహాత్మక ఉమ్మడి రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ ప్రకారం ఏ ఒక్క దేశంపై దురాక్రమణ జరిగినా దానిని ఇరు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కార్యాలయం చెప్పినట్లు డాన్ న్యూస్ పేపర్ పేర్కొంది. డిఫెన్స్ సపోర్ట్‌ను మెరుగు పరచుకోవడానికి ఈ ఒప్పందం దోహద పడుతుందని ఆ దేశాలు ఆకాంక్షించాయి.

News September 18, 2025

హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న శంకర్ తనయుడు!

image

తమిళ డైరెక్టర్ శంకర్ తనయుడు ఆర్జిత్ శంకర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్యాషన్ స్టూడియోస్ నిర్మాణంలో అశోక్ అనే డెబ్యూ డైరెక్టర్‌తో ఆయన సినిమా చేయబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. అర్జిత్ కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

News September 18, 2025

అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లు తగ్గింపు

image

వడ్డీరేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలో తొలిసారి వడ్డీరేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్లు మేర కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో వడ్డీరేట్లు 4 శాతం నుంచి 4.5 శాతం రేంజ్‌కు చేరాయి. ద్రవ్యోల్భణం పెరుగుతున్నా.. జాబ్ మార్కెట్ మందగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.