News June 1, 2024
నేడు పెద్ద హనుమాన్ జయంతి.. కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

TG: నేడు పెద్ద హనుమాన్ జయంతి కావడంతో కొండగట్టు క్షేత్రానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. గత 2 రోజుల నుంచి ఉత్సవాలు జరుగుతుండగా, దీక్ష విరమణ చేయడం కోసం మాలదారులు ఆలయానికి పోటెత్తారు. భక్తుల రద్దీ నేపథ్యంలో 650 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. కోనేరులో నీటిని ఎప్పటికప్పుడు మార్చుతున్నామని, కొండపైకి 4 RTC బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 19, 2026
ఇలా పడుకుంటే మొటిమల ముప్పు

సాధారణంగా మన చర్మం విడుదల చేసే నూనెలు, చెమట, బ్యాక్టీరియాతో పాటు మృతకణాలూ దిండు పైకి చేరతాయి. దిండు కవర్లను తరచూ మార్చకపోతే మొటిమల ముప్పు ఉంటుంది. అలాగే మేకప్ తొలగించకపోవడం, బోర్లా పడుకోవడం, గదిలో ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ ఎక్కువగా ఉండటం వల్ల కూడా చర్మం ఎక్కువ సీబమ్‌ను ఉత్పత్తి చేసి మొటిమలకు కారణమవుతాయి. కాబట్టి బెడ్‌రూంను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
News February 19, 2026
రాష్ట్రంలో ఎల్లుండి నుంచి వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ నెల 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావంతో ఈ నెల 21 నుంచి 3 రోజులపాటు రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 22వ తేదీ నుంచి 2 రోజులపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పడతాయని చెప్పింది. రానున్న 24 గంటల్లో కోస్తాలోని పలు జిల్లాల్లో పొగ మంచు కురుస్తుందని, ఎండ స్వల్పంగా పెరుగుతుందని పేర్కొంది.
News February 19, 2026
దోసకాయ బంగారమాయె.. రష్యాలో కిలో రూ.355

నాలుగేళ్లుగా ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధం కారణంగా రష్యాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దోసకాయలు కిలో 300 రూబల్స్(₹355) చొప్పున అమ్ముతున్నారని, కొన్నిచోట్ల 2, 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నెటిజన్లు వాపోతున్నారు. ప్రస్తుతం మాంసంతో సమానంగా ధర ఉంటోందని చెబుతున్నారు. దోసకాయలే ఇప్పుడు తమకు బంగారంలా మారాయని సెటైర్లు వేస్తున్నారు.


