News October 18, 2024
ఈరోజు ఈ ఏడాదిలోనే అతి పెద్ద చంద్ర దర్శనం!

ఈ ఏడాదిలోనే అతి పెద్ద చంద్రుడు ఆకాశంలో శుక్రవారం తెల్లవారుజామున దర్శనమివ్వనున్నాడు. ఈ చంద్రబింబాన్ని ‘హంటర్స్ మూన్’ లేదా సూపర్ మూన్‌గా చెబుతారు. తెల్లవారుజాము 4.30 గంటలకు చంద్రుడు సాధారణంకంటే 14శాతం పెద్దగా, 30శాతం ప్రకాశవంతంగా కనిపిస్తాడని ఖగోళ పరిశోధకులు తెలిపారు. ఈ ఏడాది సూపర్మూన్స్లో ఇది రెండోది కావడం గమనార్హం.
Similar News
News December 25, 2025
‘ఛాంపియన్’ మూవీ రివ్యూ&రేటింగ్

ఫుట్‌బాల్ ఛాంపియన్‌గా నిలవాలనుకునే హీరో బైరాన్‌పల్లి స్వాతంత్ర్య ఉద్యమంలో ఎలా చిక్కుకున్నాడు? చివరికి ఆ హీరో కల నెరవేరి ఛాంపియన్ అయ్యాడా లేదా అనేదే మూవీ కథ. హీరోహీరోయిన్లు రోషన్, అనస్వర నటన మెప్పిస్తుంది. సాంకేతికంగా బాగుంది. చాన్నాళ్ల తర్వాత తెరపై కనిపించిన నందమూరి కళ్యాణ్ చక్రవర్తి యాసతో మెప్పించలేకపోయారు. కొన్ని సీన్లు అనవసరం అనిపిస్తాయి. ఎమోషన్ సరిగ్గా పండలేదు.
రేటింగ్: 2.5/5
News December 25, 2025
నిమ్మ, నారింజ, బత్తాయి తోటల్లో పూత, పిందె రాలకుండా ఉండాలంటే..

నిమ్మ, నారింజ, బత్తాయి తోటల్లో నత్రజని, భాస్వరంతో పాటు పొటాష్ కూడా ముఖ్యం. ఇది ఆకుల్లో తయారైన పిండిపదార్థాలు, మాంసకృత్తుల రవాణాకు అవసరమైన ఎంజైములను ఉత్తేజపరిచి పూత, పిందెరాలడాన్ని తగ్గిస్తుంది. 1% పొటాషియం నైట్రేట్‌ను బఠాణి గింజ పరిమాణంలో పిందెలు ఉన్న బత్తాయి చెట్టుపై పిచికారీ చేస్తే పిందె రాలడం తగ్గి, పండు పరిమాణంతో పాటు రసం శాతం, రసంలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరల శాతం కూడా పెరుగుతుంది.
News December 25, 2025
HUDCOలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఢిల్లీలోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (<


