News March 16, 2025

నేడు అమరజీవి జయంతి

image

మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు ప్రాంతాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు. దీక్ష ప్రారంభించిన తొలిరోజు 53.9 కేజీలు ఉన్న ఆయన 58వ రోజుకు 38.1 కేజీలకు తగ్గారు. 1952 అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15 వరకు దీక్ష చేశారు. దీక్ష చివరి రోజు ప్రాణాలు వదిలారు. ఈయన పోరాటంతో 1953 OCT 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.

Similar News

News March 16, 2025

ఏఆర్ రెహమాన్ హెల్త్ అప్‌డేట్

image

మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇప్పుడు బాగానే ఉన్నారని ఆయన తనయుడు అమీన్ తెలిపారు. ‘డీహైడ్రేషన్ కారణంగా నాన్నగారు కొంచెం బలహీనంగా అనిపించారు. అందుకే ఆస్పత్రిలో రొటీన్ టెస్టులు చేయించాం. మీ ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. తాను వైద్యులతో మాట్లాడానని, రెహమాన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారని TN సీఎం స్టాలిన్ వెల్లడించారు. రెహమాన్‌ను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

News March 16, 2025

సీఎం రేవంత్ క్లాస్.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు అటెండెన్స్?

image

TG: నిన్న అసెంబ్లీలో CM రేవంత్ ప్రసంగం సమయంలో లంచ్ టైమ్ దాటిపోతున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా కదల్లేదు. రోజుకు 3సార్లు MLAల హాజరు తీసుకోవాలని ఆయన చేసిన ఆదేశాలే దీనికి కారణమని తెలుస్తోంది. 3రోజుల క్రితం CLP మీటింగ్‌లో CM మాట్లాడుతున్న సమయంలో ఓ MLA నిర్లక్ష్యంగా బయటికి వెళ్లడం, సభలో BRS నేతలకు తమ సభ్యులు సరైన కౌంటర్ ఇవ్వడం లేదనే రేవంత్ హాజరు నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

News March 16, 2025

యూట్యూబర్ హర్ష సాయిపై కేసు

image

TG: బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ <<15767906>>హర్ష సాయిపై<<>> సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. తాను ఎవరిపై వ్యక్తిగతంగా పోరాటం చేయడం లేదని, బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు సజ్జనార్ తెలిపారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది నష్టపోతున్నారని, వీటిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.

error: Content is protected !!