News April 7, 2025
నేడు భద్రాచలం శ్రీరాముడి మహాపట్టాభిషేకం

TG: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో నేడు రామయ్యకు మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఉ.10.30 గం. నుంచి మ.12.30 వరకు కళ్యాణ మండపంలో అభిషేక మహోత్సవం ఉంటుంది. ఇందులో భాగంగా శ్రీరాముడికి ఆభరణాలతో పాటు రాజదండం, రాజముద్రిక, ఛత్రం, చక్రాలు, కిరీటం, శంఖు ధరింపజేస్తారు. ఏటా శ్రీరామనవమి తర్వాత నిర్వహించే ఈ వేడుకకు ఈసారి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
Similar News
News April 9, 2025
ALERT: కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షం

TG: రాబోయే రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.
News April 9, 2025
చాహల్.. నీకోసం మేమున్నాం: RJ మహ్వాష్

PBKS ప్లేయర్ చాహల్‌కు మద్దతుగా అతని రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ RJ మహ్వాష్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘కష్టసుఖాల్లో మన వాళ్ల కోసం ఓ బండరాయిలా ఉండి అండగా నిలవాలి. చాహల్ నీకోసం మేమందరం ఉన్నాం’ అంటూ నిన్న మ్యాచ్ అనంతరం ఆయనతో తీసుకున్న సెల్ఫీని షేర్ చేశారు. దానికి చాహల్ స్పందిస్తూ.. ‘మీరే నా వెన్నెముక! నన్ను ఎల్లప్పుడూ ఉన్నతంగా నిలబెట్టినందుకు ధన్యవాదాలు’ అని లవ్ సింబల్‌తో కామెంట్ చేశారు.
News April 9, 2025
iPhone 17Pro: ఒకేసారి 2 కెమెరాలతో రికార్డింగ్!

iPhone17 సిరీస్ మొబైల్స్ సెప్టెంబర్‌లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. కొత్త ఫీచర్లు, డిజైన్‌లో మార్పులతో సరికొత్తగా ఉండనున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. iPhone 17Proలో ఫ్రంట్, బ్యాక్ కెమెరాలతో ఒకే సమయంలో వీడియో రికార్డ్ చేయగలిగే ఫీచర్ రాబోతోందంటున్నారు. అధికారిక ప్రకటన రాకపోయినా దీనిపై SMలో చర్చ జరుగుతోంది. INDలో iPhone17 ప్రారంభ ధర ₹79,900, iPhone 17Pro ₹1,44,900గా ఉండనున్నట్లు తెలుస్తోంది.