News June 24, 2024
నేడు ఏపీ కేబినెట్ తొలి భేటీ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్, పింఛన్ల పెంపుపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టులపై మంత్రులు సమాలోచనలు చేయనున్నారు. అలాగే సూపర్-6 పథకాల అమలుపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియపరిచేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవచ్చు.
Similar News
News December 6, 2025
బ్రెస్ట్ క్యాన్సర్ను ఎలా గుర్తించాలంటే?

బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించడానికి మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తారు. అయితే భారతీయ మహిళల్లో రొమ్ములు చాలా దట్టంగా ఉండటం వల్ల.. ఈ పరీక్ష సమయంలో క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు మిస్ అవుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు పరిశోధకులు. అలాగే మహిళలు కూడా తమ రొమ్ములను ఎప్పటికప్పుడు స్వీయ పరీక్ష చేసుకోవాలని సూచిస్తున్నారు.
News December 6, 2025
భారీ జీతంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
గుడికెళ్లి, దేవుడిని దర్శిస్తే పుణ్యం లభిస్తుందా?

ఆలయాలకు వెళ్లడం అంటే కేవలం దేవుడిని చూడటం కాదు. విగ్రహారాధనలోని రహస్యాన్ని, దర్శనం పరమార్థాన్ని తెలుసుకోవాలి. భగవంతుని గొప్ప లీలలు, గుణాలను మనసులో తలుచుకోవాలి. ఆయనే మనకు శరణం అని గుర్తించాలి. నిరంతరం ఆయనపై ధ్యానం ఉంచుతూ, ఆయనకు నచ్చిన మంచి పనులు చేయాలి. కేవలం దర్శనం కాకుండా, ఈ సత్యాన్ని గ్రహిస్తేనే మనం జీవితంలో మోక్షాన్ని సాధించగలం. <<-se>>#Bakthi<<>>


