News March 20, 2024
నేడే ఎన్నికల తొలి నోటిఫికేషన్

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి విడతలో భాగంగా ఇవాళ 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ రానుంది. ఈ నెల 27 వరకు నామినేషన్ల స్వీకరణ, 28న పరిశీలన, 30న ఉపసంహరణకు తుది గడువు. వచ్చే నెల 19న పోలింగ్ జరగనుంది. అత్యధికంగా తమిళనాడులో ఒకే విడతలో 39 స్థానాలకూ పోలింగ్ నిర్వహించనున్నారు.
Similar News
News December 8, 2025
హీరోయిన్‌కు వేధింపులు.. మలయాళ నటుడిని నిర్దోషిగా తేల్చిన కోర్టు

హీరోయిన్‌పై లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు కేరళలోని ఎర్నాకులం జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. వారికి శిక్షను ఈనెల 12న ప్రకటించనుంది. 2017లో సినీ నటిపై వేధింపుల కేసులో దిలీప్ అరెస్టయ్యారు. కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. దాదాపు 8 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది.
News December 8, 2025
ఇండిగో సంక్షోభం.. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో

ఇండిగో విమానాల సంక్షోభంపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై చర్యలు తీసుకుంటోందని తెలిపింది. ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే ఇది తీవ్రమైన సమస్య అని, లక్షలాది మంది బాధితులు ఉన్నారని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా విమానాల రద్దుపై ఈ పిల్ దాఖలైంది.
News December 8, 2025
రూ.7,887 కోట్లు అకౌంట్లలో జమ

TG: వరి సేకరణలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 41.6 లక్షల టన్నుల వరి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. 8,401 PPCలలో 7.5 లక్షల మంది రైతులకు 48 గంటల్లోనే రూ.7,887 కోట్లు చెల్లించామని తెలిపారు. వరి కొనుగోళ్లలో 45% ఐకేపీ మహిళల భాగస్వామ్యంతో మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని మంత్రి పేర్కొన్నారు.


