News October 24, 2024

నేడు న్యూజిలాండ్‌తో తొలి వన్డే

image

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత మహిళల జట్టు నేడు తొలి వన్డే ఆడనుంది. మ్యాచ్ అహ్మదాబాద్‌లో మ.1.30గం.కు ప్రారంభమవుతుంది. T20 వరల్డ్ కప్ గెలిచి జోరుమీదున్న న్యూజిలాండ్‌ను ఎదుర్కోవడం భారత్‌కు సవాల్‌తో కూడుకున్న పనే. అటు భారీ అంచనాలతో బరిలోకి దిగిన హర్మన్ సేన పేలవమైన ప్రదర్శనతో సెమీస్ కూడా చేరకుండా ఇంటికి వచ్చిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు కివీస్‌ను భారత్ ఎలా నిలువరిస్తుందో చూడాలి.

Similar News

News January 29, 2026

మేడారంలో నేడే కీలక ఘట్టం.. గద్దెపైకి చేరుకోనున్న సమ్మక్క

image

TG: మేడారం మహాజాతరలో ఇవాళ ప్రధాన ఘట్టానికి తెరలేవనుంది. భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి మేడారం గద్దెపై కొలువుదీరనుంది. పూజారులు సాయంత్రం చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న తల్లిని తెచ్చి ప్రతిష్ఠిస్తారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఇక ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. నిన్న 40 లక్షల మంది గద్దెలను దర్శించుకున్నారు.

News January 29, 2026

CLRIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (<>CLRI<<>>) 13 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, PwBDలకు ఫీజు లేదు. Jr. స్టెనోగ్రాఫర్‌కు నెలకు రూ.53,628, Jr.సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.39,545, MTSకు రూ.35,973 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://clri.org

News January 29, 2026

మొక్కజొన్న కంకిలో గింజలు చివరి వరకూ రావాలంటే?

image

మొక్కజొన్న కంకిలో గింజలు నిండుగా రావాలంటే గింజలు పాలుపోసుకునే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పంటకు అవసరమైన నీటిని అందించాలి. అలాగే చివరి దఫా ఎరువుగా నిపుణుల సూచనల మేరకు పొటాష్ అందిస్తే గింజ గట్టిపడి పొత్తు బరువు పెరుగుతుంది. అలాగే పంటకు సిఫార్సు మేరకు యూరియా, ఇతర పోషకాలను సరైన మోతాదులో అందించాలి. మొక్కల మధ్య సరైన దూరం పాటిస్తే అన్ని మొక్కలకు పోషకాలు సమానంగా అందుతాయి.