News October 16, 2024
నేడు భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు

మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా 36 ఏళ్లుగా న్యూజిలాండ్ మన గడ్డపై సిరీస్ గెలవలేదు. ఇప్పుడైనా గెలిచి ఆ రికార్డును తుడిచేయాలని కివీస్ భావిస్తోంది. మరోవైపు టీమ్ ఇండియాకు సొంత గడ్డపై ఎదురేలేకుండా పోతోంది. 2013 నుంచి ఇక్కడ ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు.
Similar News
News November 23, 2025
సంగారెడ్డి: ‘మహిళలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం’

సంగారెడ్డి జిల్లాలో డ్వాక్రా గ్రూపు మహిళలకు రూ. 590 కోట్ల రుణాలను అందించినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. రూ. 32 కోట్ల వడ్డీ రాయితీ రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదగడమే సీఎం రేవంత్ రెడ్డి లక్షమని పేర్కొన్నారు.
News November 23, 2025
ఇంధన పొదుపుపై షార్ట్ వీడియో పోటీలు

AP: ఇంధన సామర్థ్యం/పొదుపుపై షార్ట్ వీడియో పోటీలు నిర్వహిస్తున్నట్లు జెన్‌కో MD నాగలక్ష్మి వెల్లడించారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులు పోటీకి అర్హులని తెలిపారు. ‘తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో 30-120సెకన్ల నిడివితో MP4 ఫార్మాట్‌లో వీడియోలు రూపొందించి DEC 10లోగా పంపాలి. తొలి 3 స్థానాల్లో నిలిచిన వారికి ₹20K, ₹10K, ₹5K బహుమతులు ఇస్తాం. వివరాలకు 0866-2457620 నంబరులో సంప్రదించాలి’ అని చెప్పారు.
News November 23, 2025
సర్పంచి ఎన్నికలు.. UPDATE

TG: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ రిజర్వేషన్ల జాబితాను జిల్లాల కలెక్టర్లకు పంపిస్తోంది. సాయంత్రం కల్లా ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు తెలుస్తోంది. జనాభా నిష్పత్తిని బట్టి SC, ఎస్టీ, బీసీ స్థానాలను కేటాయించినట్లు సమాచారం. కాగా బీసీలకు 22%తో కలుపుకొని మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.


