News September 23, 2025

నేడు శ్రీ గాయత్రీ దేవి అవతారం.. ఏ పూలతో పూజ చేయాలి?

image

దసరా నవరాత్రుల్లో రెండో రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తారు.. ఈ రూపంలో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి, పంచ ముఖాలు, పది కళ్లతో, భూమి, ఆకాశం, సృష్టిని సూచించే రంగుల కిరీటంతో ముక్తా, హేమ, నీల, విద్రుమ, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ ఉంటారు. ఈ రోజున అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పించాలి. పసుపు రంగు పూలతో పూజించాలి. ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదించాలి.

Similar News

News September 23, 2025

‘టాప్ 2%’ శాస్త్రవేత్తల్లో 3,372 మంది ఇండియన్స్

image

వరల్డ్‌లోని ‘టాప్ 2%’ శాస్త్రవేత్తల్లో 3,372 మంది ఇండియన్స్ ఉన్నట్లు USలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ తెలిపింది. శాస్త్రవేత్తలు పబ్లిష్ చేసిన రీసెర్చ్ పేపర్స్, తదితర అంశాలను పరిగణించి లిస్ట్‌ రిలీజ్ చేసింది. ఇందులో ఇండియాలోని IITల నుంచి 755 మంది, NITల నుంచి 330 మంది ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని IIT, NIT, HCU, IIM(వైజాగ్), ఇతర వర్సిటీల నుంచి 100 మందికి పైగా చోటు దక్కించుకున్నారు.

News September 23, 2025

బతుకమ్మ ఆడుతూ ఇద్దరు మృతి

image

TG: బతుకమ్మ పండుగ వేళ 2 కుటుంబాల్లో విషాదం నెలకొంది. మహబూబాబాద్(D) ఎంచగూడెంకు చెందిన మౌనిక(32) ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మ ఆడేందుకు వెళ్లగా DJ సౌండ్‌తో గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. సంగారెడ్డి(D) మాచిరెడ్డిపల్లిలో మేఘన(24) బతుకమ్మ ఆడుతూ ఛాతీనొప్పితో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయారు.

News September 23, 2025

ఎమ్మెల్యేలు నెలకోరోజు పొలాలకు వెళ్లండి: చంద్రబాబు

image

AP: వ్యవసాయంపై శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. అక్టోబర్ నుంచి నెలకో రోజు పొలాలకు వెళ్లాలని అసెంబ్లీలో సభ్యులకు తెలిపారు. రైతులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. త్వరలో తానూ అన్నదాతల్ని కలుస్తానని పేర్కొన్నారు. పంట ధరలు తగ్గితే ఆదుకుంటున్నామని వెల్లడించారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించేందుకు భూసార పరీక్షలు చేసి సూక్ష్మపోషకాలు అందిస్తామన్నారు.