News January 15, 2025

ITR దాఖలుకు ఇవాళే చివరి తేదీ

image

2023-24కు గాను ఐటీఆర్ ఫైలింగ్‌కు ఇవాళే చివరి తేదీ. లేట్, రివైజ్డ్ రిటర్న్స్‌ను రాత్రి 12 గంటల్లోపు దాఖలు చేయాలి. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. మొత్తం ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూ.1,000, రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.5,000 ఆలస్య రుసుము చెల్లించాలి. నేడు ITR దాఖలు చేయకపోతే లీగల్ నోటీసులు, జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Similar News

News December 14, 2025

హెయిర్ డై మచ్చలు పోవట్లేదా?

image

అందంగా కనిపించాలనో, తెల్లవెంట్రుకలు దాయాలనో చాలామంది హెయిర్ డైలు వాడుతుంటారు. అయితే కొన్నిసార్లు వీటి మచ్చలు నుదురు, మెడ దగ్గర అంటి ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటప్పుడు బేబీ ఆయిల్‌, ఎసెన్షియల్ ఆయిల్స్‌ను మచ్చలపై అప్లై చేసి కాసేపు రుద్ది కడిగేస్తే సరిపోతుంది. వెనిగర్‌లో ముంచిన కాటన్ బాల్‌తో రుద్దినా మచ్చలు తగ్గుతాయి. నిమ్మరసంలో కాస్త కొబ్బరినూనె కలిపి రాసినా ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

News December 14, 2025

MP-IDSAలో ఉద్యోగాలు

image

మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైసిస్(MP-IDSA)లో 9 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రీసెర్చ్ ఫెల్లో, అసోసియేట్ ఫెల్లో, రీసెర్చ్ అనలిస్ట్ పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంఫిల్, పీహెచ్‌డీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.idsa.in

News December 14, 2025

లేటెస్ట్ మూవీ అప్‌డేట్స్

image

✦ 2026, జనవరి 1న వెంకటేశ్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా థియేటర్లలో రీరిలీజ్
✦ ఈరోజు సా.6.30 గంటలకు ‘రాజాసాబ్’ నుంచి ‘సహానా సహానా’ పాట ప్రోమో విడుదల.. పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ టీమ్
✦ ‘మోగ్లీ’ సినిమాకు తొలి రోజు రూ.1.22 కోట్ల కలెక్షన్స్
✦ డిసెంబర్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం?