News April 28, 2024

పాలిసెట్‌ దరఖాస్తుకు నేడే ఆఖరు

image

TG: పాలిటెక్నిక్, డిప్లొమా, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2024కు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. కాగా ఆలస్య రుసుము రూ.100తో ఈ నెల 30 వరకు, రూ.300తో మే 20 వరకు అప్లై చేసుకోవచ్చని సాంకేతిక విద్యాశిక్షణ మండలి అధికారులు తెలిపారు. వచ్చే నెల 24న పరీక్షలు నిర్వహించి, పది రోజుల తర్వాత ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Similar News

News November 20, 2025

హిమాలయాలకే వెళ్తాం.. చాలామంది ట్రావెల్ డెస్టినేషన్ ఇదేనట!

image

‘అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ట్రావెల్’ విడుదల చేసిన అత్యంత ప్రతిష్ఠాత్మక ‘ట్రెండింగ్ డెస్టినేషన్స్ 2026’ జాబితాలో హిమాలయాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఆధ్యాత్మికత, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కలగలిసిన ఈ పర్వత శ్రేణులు వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువమంది యాత్రికులను ఆకర్షించనున్నాయని సంస్థ పేర్కొంది. ఇది భారత హిమశిఖరాలకు దక్కిన గొప్ప అంతర్జాతీయ గౌరవమని నెటిజన్లు కొనియాడుతున్నారు.

News November 20, 2025

ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

image

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్‌నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.

News November 20, 2025

త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

image

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్‌కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్‌లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.