News April 10, 2024
టెట్ దరఖాస్తులకు నేడే లాస్ట్ డేట్
TG: TET దరఖాస్తుల గడువు ఇవాళ్టితో ముగియనుంది. నిన్నటి వరకు 1.93 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి అప్లికేషన్ల సంఖ్య భారీగా తగ్గింది. అప్లికేషన్ ఫీజు పెంచడం, ఎక్కువ మంది అభ్యర్థులు డీఎస్సీకి ప్రిపేర్ అవుతుండటం ఇందుకు కారణాలుగా తెలుస్తోంది. దరఖాస్తుల గడువును మరో వారం రోజులు పొడిగిస్తారని సమాచారం. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు జరగనున్నాయి.
Similar News
News November 15, 2024
SBI హౌస్ లోన్ తీసుకున్నారా?
SBI మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్స్(MCLR)ను 5 బేసిస్ పాయింట్ల(0.05 శాతం) మేర పెంచింది. దీంతో హౌస్ లోన్ వంటి దీర్ఘకాలిక రుణాలకు సంబంధించిన ఏడాది కాల వ్యవధి MCLR 9 శాతానికి చేరింది. అలాగే 3, 6 నెలల రుణ రేట్లను అదే మేర పెంచింది. అయితే ఓవర్‌నైట్, నెల, రెండేళ్లు, మూడేళ్ల MCLR రేట్లను సవరించలేదు. పెరిగిన రేట్లు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని SBI ప్రకటించింది.
News November 15, 2024
ఫైనల్ దశకు ‘వీరమల్లు’ షూటింగ్
జ్యోతికృష్ణ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పవర్ స్టార్ లేని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. తదుపరి షెడ్యూల్‌లో పవన్ పాల్గొంటారని, దీంతో షూటింగ్ పూర్తవుతుందని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది మార్చి 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూవీ విడుదల కానుంది.
News November 15, 2024
బీసీ రిజర్వేషన్లపై రేపటి నుంచి సలహాల స్వీకరణ!
TG: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల నిర్ధారణపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ రేపటి నుంచి బహిరంగ విచారణ చేపట్టనుంది. ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్ల పరిధిలో ప్రతిరోజు ఉ.11:30 నుంచి మ.3 గంటల వరకు ప్రజల నుంచి సలహాలు, వినతులు స్వీకరించనుంది. రేపు నల్గొండ, ఈనెల 17న ఖమ్మం, 18న మహబూబ్‌నగర్ జిల్లాలో బహిరంగ విచారణ నిర్వహించనుంది.