News November 20, 2024
టెట్ దరఖాస్తులకు నేడే లాస్ట్ డేట్

TG: టెట్ దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. నిన్న రాత్రి వరకూ 2,07,765 దరఖాస్తులు వచ్చినట్లు సెట్ కన్వీనర్ జి.రమేశ్ వెల్లడించారు. పేపర్-1కు 61,930 మంది, పేపర్-2కు 1,28,730 మంది, రెండు పేపర్లకు 17,104 మంది అప్లై చేసుకున్నారని తెలిపారు. కాగా ఎడిట్ ఆప్షన్ గడువు ఈనెల 22తో ముగియనుంది. దరఖాస్తు సమయంలో ఏవైనా సమస్యలు వస్తే 7032901383, 9000756178 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Similar News
News January 1, 2026
Stock Market: కొత్త ఏడాదికి లాభాలతో స్వాగతం

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త సంవత్సరాన్ని లాభాలతో ప్రారంభించాయి. నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 26,183 వద్ద.. సెన్సెక్స్ 170 పాయింట్లు పెరిగి 85,391 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో M&M, ఎటర్నల్, రిలయన్స్, L&T, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో.. ITC, BEL, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, ట్రెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News January 1, 2026
నల్ల నువ్వులతో గ్రహ దోషాలు దూరం: పండితులు

గ్రహ దోషాల వల్ల కలిగే శత్రు బాధలు, ఆటంకాల నుంచి ఉపశమనానికి నల్ల నువ్వులు దివ్యౌషధంలా పనిచేస్తాయి. శనివారం సాయంత్రం నువ్వుల నూనెలో నల్ల నువ్వులు వేసి దీపారాధన చేయడం, పేదలకు నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. అలాగే అమావాస్య రోజున పితృ దేవతలకు తిల తర్పణం వదిలితే వారి ఆశీస్సులు లభించి కష్టాలు తొలగిపోతాయి. భక్తితో పాటు మంచి ప్రవర్తన ఉంటే ఈ పరిహారాలు శీఘ్ర ఫలితాలనిస్తాయి.
News January 1, 2026
5-10 శాతం పెరగనున్న AC, రిఫ్రిజిరేటర్ల ధరలు

బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ప్రభావంతో AC, రిఫ్రిజిరేటర్ల ధరలు 5-10% వరకు పెరగనున్నాయి. BEE కొత్త నిబంధనల ప్రకారం 5-స్టార్ ACలు 10% ఎక్కువ ఎనర్జీ ఎఫిషియంట్‌గా ఉండాలి. ఇందుకోసం ఖరీదైన భాగాలు ఉపయోగించాల్సి రావడంతో పాటు రూపాయి విలువ పతనం, కాపర్ ధరల పెరుగుదల కూడా కారణాలుగా కంపెనీలు చెబుతున్నాయి.


