News December 10, 2024
UGC NET దరఖాస్తులకు నేడే లాస్ట్ డేట్

UGC NET-2024 <
Similar News
News October 23, 2025
ఎక్కువ సేపు షార్ట్స్ చూడకుండా యూట్యూబ్ నియంత్రిస్తుంది!

చాలా మంది రోజంతా రీల్స్, షార్ట్ వీడియోలు చూస్తూ ఎక్కువ సమయాన్ని వృథా చేస్తుంటారు. దీనిని నియంత్రించుకునేందుకు యూట్యూబ్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు రోజుకు ఎంత సమయం షార్ట్స్ చూడాలో సెట్టింగ్స్‌లో ‘డైలీ స్క్రోలింగ్ లిమిట్’ సెట్ చేసుకోవచ్చు. నిర్ణయించుకున్న సమయం పూర్తవగానే షార్ట్స్ ఫీడ్ ఆగిపోయి నోటిఫికేషన్ వస్తుంది. డిజిటల్ వెల్‌బీయింగ్‌కు తోడ్పడేలా యూట్యూబ్ ఈ ఫీచర్‌ను తెచ్చింది.
News October 23, 2025
మగాడివైతే మాతో పోరాడు.. ఆసిమ్ మునీర్‌కు పాక్ తాలిబన్ల సవాల్

పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) సవాల్ విసిరింది. తమపైకి సైనికులను పంపడం మానుకుని, ఉన్నతాధికారులే యుద్ధానికి రావాలంటూ వీడియోను రిలీజ్ చేసింది. ‘నువ్వు మగాడివైతే మాతో పోరాడు. తల్లిపాలు తాగుంటే మాతో యుద్ధం చెయ్’ అని ఆసిమ్ మునీర్‌కు TTP కమాండర్ కజీం ఛాలెంజ్ విసిరాడు. కాగా కజీం సమాచారం ఇచ్చిన వారికి రూ.10 కోట్ల రివార్డును పాక్ అధికారులు ప్రకటించారు.
News October 23, 2025
కోత ముప్పు తప్పించేలా తీరం వెంబడి ‘గ్రేట్ గ్రీన్ వాల్’

AP: రాష్ట్రంలోని 1,053 KM తీరం వెంబడి 5 KM వెడల్పుతో ‘గ్రేట్ గ్రీన్ వాల్’ నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. మల్టీ లేయర్ గ్రీన్ బఫర్ జోన్లుగా ఇది ఉంటుంది. దీనివల్ల తుఫాన్ల నుంచి తీర రక్షణ, స్థిరమైన మత్స్య సంపద వృద్ధితో 30 లక్షల మంది ఉపాధి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. కేంద్ర పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల సహకారంతో అంతర్జాతీయ సంస్థల నుంచి, campa, nregsల ద్వారా నిధులు సమకూర్చనున్నారు.