News February 25, 2025

జేఈఈ మెయిన్ సెషన్2 దరఖాస్తులకు నేడే ఆఖరు

image

జేఈఈ మెయిన్ సెషన్2 దరఖాస్తులకు గడువు నేటితో ముగియనుంది. అభ్యర్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 1-8 మధ్య మెయిన్ పరీక్ష జరగనుంది. తొలి సెషన్ పరీక్ష జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే.
వెబ్‌సైట్: https://jeemain.nta.nic.in/

Similar News

News November 11, 2025

మా తండ్రి చనిపోలేదు: ఈషా డియోల్

image

తన తండ్రి ధర్మేంద్ర చనిపోలేదని కూతురు ఈషా డియోల్ ప్రకటించారు. ఆయన చనిపోయినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ధర్మేంద్ర మృతికి సంతాపం తెలుపుతూ సినీ ప్రముఖులు పోస్టులు పెట్టడంతో ఫ్యాన్స్‌తో పాటు మీడియా వర్గాలు ఆయన చనిపోయినట్లు భావించాయి. అయితే తాజాగా ఆయన కూతురు ధర్మేంద్ర చనిపోలేదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

News November 11, 2025

శబరిమలకు అద్దె బస్సులు

image

TG: రాష్ట్రంలోని నలుమూలల నుంచి శబరిమలకు 200 అద్దె బస్సులు నడపాలని RTC నిర్ణయించింది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులను నడిపేందుకు సిద్ధమై స్పెషల్ టారిఫ్‌లను ఖరారు చేసింది. గురుస్వామి పేరుతో బస్ బుక్ చేస్తే ఆ స్వామి ఉచితంగా ప్రయాణించవచ్చు. ముందుగా కాషన్ డిపాజిట్ రూ.10వేలు చెల్లించాలి. తిరిగొచ్చాక ఆ డబ్బు వెనక్కిస్తారు. పూర్తి వివరాలకు డిపోలో సంప్రదించాల్సి ఉంటుంది.

News November 11, 2025

కొవిడ్ లాక్‌డౌన్.. వారికి కొత్త ద్వారాలు తెరిచింది

image

కరోనా లాక్‌డౌన్‌ వీరి జీవితాన్ని మార్చేసింది. లండన్‌లో BBA చదువుతున్న ఆయుష్, దుబాయ్‌లో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న రిషబ్ ఇండియాకు తిరిగివచ్చారు. స్వదేశంలోనే ఉండాలని, వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ ప్రోత్సాహంతో కూరగాయల సాగును ప్రారంభించి.. పుట్టగొడుగులకు ఉన్న డిమాండ్ చూసి వాటిని కూడా ఉత్పత్తి చేస్తూ ఆగ్రా సహా ఇతర రాష్ట్రాల మార్కెట్లు, హోటల్స్‌కు అందిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.