News September 8, 2024

నేడు పారిస్ పారాలింపిక్స్ చివరి రోజు

image

పారిస్ పారాలింపిక్స్ ఆదివారంతో ముగియ‌నుంది. చివ‌రి రోజు మహిళల కయాక్ సింగిల్ 200M – KL1 సెమీఫైనల్స్‌లో భార‌త్ త‌ర‌ఫున‌ పూజా ఓజా పోటీ పడుతున్నారు. మ‌ధ్నాహ్నం 1.30 జ‌రిగే సెమీస్ గెలిస్తే, 2.55 గంట‌ల‌కు ఫైన‌ల్లో పోటీప‌డాల్సి ఉంటుంది. ఈ పారాలింపిక్స్ భార‌త్‌కు ఒక మైలురాయి. గ‌తం కంటే ఘ‌నంగా ఈసారి 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో భార‌త బృందం 29 పతకాలు గెలుచుకుంది.

Similar News

News January 23, 2026

వరిలో రాగి, బోరాన్ లోపాన్ని ఇలా గుర్తించండి

image

వరిలో రాగి సూక్ష్మపోషకం లోపిస్తే ఆకు చివర ఎండి, ఆకుపై ముతక ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. వెన్నులోని గింజలు చిన్నవిగా ఉంటాయి. రాగి లోప నివారణకు ఆకులపై ఒక లీటరు నీటిలో 1 గ్రాము కాపర్‌సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. బోరాన్ లోపిస్తే పంట లేత ఆకుల చివరలు మెలితిరిగి, వేర్లు వృద్ధి చెందవు. పంట ఎదుగుదల సరిగా ఉండదు. బోరాన్ లోప నివారణకు లీటరు నీటికి 1 గ్రాము బోరాక్స్ ద్రావణాన్ని కలిపి పంటపై పిచికారీ చేయాలి.

News January 23, 2026

వృత్తులు చేస్తున్నారా? ఇలా చేస్తే నైపుణ్యం మీవెంట..

image

సరస్వతీ దేవిని ‘సకల కళా స్వరూపిణి’ అంటారు. అందుకే ఈ రోజున సంగీతకారులు తమ వాయిద్యాలను (వీణ, తబలా, వయొలిన్), చిత్రకారులు తమ కుంచెలను, డ్యాన్సర్స్ తమ గజ్జెలను పూజించాలి. దీనివల్ల వారిలో దాగి ఉన్న సృజనాత్మకత వెలికివస్తుంది. అలాగే వృత్తి పని వారు తమ పనిముట్లను శుభ్రం చేసి పూజించడం వల్ల ఆ వృత్తిలో నైపుణ్యం పెరిగి, ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి. ఏ రంగంలో అయినా ప్రతిభ చాటుకోవాలనుకునే వారికి ఈ దినం ఒక వరం.

News January 23, 2026

అమెజాన్‌లో 16 వేల ఉద్యోగాల కోత!

image

అమెజాన్‌లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా 16 వేల మందిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెజాన్‌ 30 వేల మందిని తొలగించనుందని గతేడాది అక్టోబర్‌లో రాయిటర్స్ తెలిపింది. ఈ క్రమంలో తొలి విడతలో 14 వేల మందిని ఆ కంపెనీ ఇంటికి పంపింది. రెండో విడతలో భాగంగా ఈనెల 27 నుంచి లేఆఫ్స్ ఇవ్వనుందని సమాచారం. ఇప్పటికే తమకు మేనేజర్లు హింట్ ఇచ్చారని ఉద్యోగులు చెబుతున్నారు. 2023లోనూ 27 వేల మందిని అమెజాన్ తీసేసింది.