News March 7, 2025
నీట్-UG దరఖాస్తుకు నేడే లాస్ట్

2025-26 విద్యాసంవత్సరానికి గాను MBBS, BDS, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నీట్-UG దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం ఉంటుంది. మే 4న దేశవ్యాప్తంగా మ.2 గంటల నుంచి సా.5 వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
వెబ్సైట్: https://examinationservices.nic.in/
Similar News
News March 9, 2025
గ్రూప్-1 ఫలితాలు.. UPDATE

రేపు గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనున్న సంగతి తెలిసిందే. ముందుగా మార్కులను ప్రకటించనుండగా తర్వాత రీకౌంటింగ్ కోసం అభ్యంతరాలు స్వీకరించనుంది. అనంతరం మెరిట్ మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తితో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయనుంది. మొత్తం 563 పోస్టులకు గాను 21,093 మంది మెయిన్స్ పరీక్ష రాశారు.
News March 9, 2025
ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు రూ.11 వేల కోట్లు

TG: రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.11 వేల కోట్లను మంజూరు చేసింది. వీటి నిర్మాణ బాధ్యతలను విద్యాశాఖ అనుబంధ సంస్థ టీజీఈడబ్ల్యూఐడీసీకి అప్పగించింది. రాష్ట్రంలో 55 నియోజకవర్గాల్లో ఒక్కో క్యాంపస్ చొప్పున రూ.200 కోట్లతో నిర్మించనున్నారు. ముందుగా కొడంగల్, మధిర, హుజుర్ నగర్లో నిర్మాణాలకు టెండర్లు పిలవనున్నారు.
News March 9, 2025
త్వరలోనే జీఎస్టీ రేట్లు మరింత తగ్గింపు: నిర్మలా సీతారామన్

త్వరలోనే జీఎస్టీ రేట్లను మరింతగా తగ్గిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ అవసరాలకు తగ్గట్లుగా సవరణలు ఉండేలా చూస్తున్నామని తెలిపారు. దీంతో పాటు ట్యాక్స్ స్లాబ్లను రేషనలైజ్ చేస్తామన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ధరలు పెరగలేదని పేర్కొన్నారు. పన్ను చెల్లించేవారికి ఉపశమనం కలిగించడమే తమ లక్ష్యమన్నారు. స్టాక్ మార్కెట్ల ఒడిదొడుకులకు కారణాలను కచ్చితంగా చెప్పలేమన్నారు.