News July 7, 2024

జింబాబ్వేతో నేడే రెండో మ్యాచ్

image

జింబాబ్వేతో 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో టీం ఇండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ లెక్క సరిచేసేందుకు భారత జట్టుకు ఈరోజు అవకాశం దక్కనుంది. సిరీస్‌లో రెండో మ్యాచ్ ఈరోజు సాయంత్రం 4.30కు ప్రారంభం కానుంది. నిన్నటి మ్యాచ్‌లో బౌలింగ్ బాగానే చేసినా బ్యాటింగ్, ఫీల్డింగ్ పరంగా భారత ప్రదర్శన ఘోరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఇండియా గెలవాల్సిందేనంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Similar News

News March 3, 2026

కేంద్ర మాజీ మంత్రి ఉన్నికృష్ణన్ కన్నుమూత

image

కేంద్ర మాజీ మంత్రి KP ఉన్నికృష్ణన్ (89) మంగళవారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కేరళలో తుదిశ్వాస విడిచారు. 1971 నుంచి 1996 వరకు వడకర MPగా ప్రాతినిధ్యం వహించిన ఆయన VP సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 1990 గల్ఫ్ యుద్ధ సమయంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను రహస్యంగా కలిశారు. ప్రాణాలకు తెగించి మరీ 1.5 లక్షల మంది భారతీయులను స్వదేశానికి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.

News March 3, 2026

ఖమేనీ హత్యపై మౌనం బాధ్యతారాహిత్యం: సోనియా గాంధీ

image

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తప్పుబట్టారు. ఇది ‘న్యూట్రల్‌’గా ఉండడం కాదని, విదేశాంగ విధానంలో ‘బాధ్యతారాహిత్యం’ అని విమర్శించారు. చర్చలు జరుగుతున్న సమయంలో ఒక దేశాధినేతను చంపడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, దీనిపై భారత్ స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు.

News March 3, 2026

నటుడు శివాజీ రాజా తండ్రి కన్నుమూత

image

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి రామరాజు(85) కన్నుమూశారు. వయోభారంతో పాటు అనారోగ్య కారణాలతో HYDలోని మధురానగర్ స్వగృహంలో ఈ ఉదయం చనిపోయారు. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు శివాజీ రాజా ఇంటికి చేరుకొని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో రామరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.