News December 29, 2024

నేడు కొమురవెల్లి మల్లన్న కళ్యాణం

image

TG: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో నేడు స్వామివారి కళ్యాణం జరగనుంది. ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో స్వామి వివాహం నిర్వహించనున్నారు. దీంతో మూడు నెలలపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ప్రభుత్వం తరఫున మంత్రులు సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.

Similar News

News November 23, 2025

అతిగా స్క్రీన్ చూస్తే ఆలస్యంగా మాటలు!

image

పిల్లలను అతిగా స్క్రీన్(TV, ఫోన్) చూసేందుకు అలవాటు చేస్తే వారి భవిష్యత్తుకు ప్రమాదమని అంతర్జాతీయ సర్వే హెచ్చరిస్తోంది. చిన్నవయసులో(1-5 ఏళ్లు) ఎక్కువగా స్క్రీన్ చూసే పిల్లలకు మాటలు రావడం ఆలస్యమవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అటు కొత్త పదాలు నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతుందని పేర్కొంది. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని, తప్పనిసరైతే నాలెడ్జ్ పెంచే వీడియోలను సూచించాలని చెబుతోంది.

News November 23, 2025

మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్

image

తెలంగాణ మంత్రులు, పలు శాఖల అధికారిక వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయి. SBI ఆధార్ అప్‌డేట్ పేరుతో ప్రమాదకర APK ఫైల్స్ షేర్ అయ్యాయి. ఆ ఫైల్స్‌ను ఓపెన్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అప్పటికే ఓపెన్ చేసిన పలువురు జర్నలిస్టులు.. తమ ఫోన్లు హ్యాక్ అయినట్లు ఫిర్యాదులు చేస్తున్నారు.

News November 23, 2025

వరి, పత్తి పంటల్లో బోరాన్ లోపం ఇలా గుర్తించండి

image

☛ వరి: బోరాన్ లోపం వల్ల వరి లేత ఆకుల చివర్లో తెల్లగా మారి వంకర్లు తిరుగుతాయి. వరి పొట్ట దశ నుంచి ఈత దశలో పుప్పొడి ఉత్పత్తి తగ్గి గింజ గట్టిపడక కుదురులోని అన్ని పిలకలు తాలుగా మారతాయి. ☛ పత్తి: లేత చిగుర్లు చిగురించవు. మొగ్గల పెరుగుదల ఆగిపోయి పక్కల నుంచి మొగ్గలు వస్తాయి. లేత ఆకుల చివర్లు, లేత మొగ్గలు దళసరిగా మారి, కుళ్లుతున్నట్లు కనిపిస్తాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి.