News March 16, 2024

త్యాగమూర్తి పొట్టిశ్రీరాములు జయంతి నేడు

image

స్వభాషారాష్ట్రం కోసం ఆత్మార్పణకు పూనుకొన్న యోధుడు పొట్టి శ్రీరాములు. ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం 1952 OCT 10 నుంచి 58 రోజుల పాటు ఆయన మద్రాస్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అసువులు బాసి అమరజీవి అయ్యారు. ఆయన ధీరోదాత్త ఆత్మత్యాగ ఫలితమే ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర అవతరణ. 1953 OCT 1న కర్నూలు జిల్లా రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 2008లో నెల్లూరు జిల్లా పేరును శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు.

Similar News

News September 29, 2024

యూట్యూబర్‌ మల్లిక్‌తేజ్‌పై అత్యాచారం కేసు

image

TG: యూట్యూబ్ స్టార్, ఫోక్ సింగర్ మల్లిక్‌తేజ్‌పై అత్యాచార కేసు నమోదైంది. మాయమాటలు చెప్పి తనపై లైంగిక దాడి చేశాడని ఓ యువతి జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని, తరచూ ఫోన్ చేసి పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో వెల్లడించారు. ఈమేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇటీవల యూట్యూబర్ హర్షసాయిపైనా రేప్ కేసు నమోదైంది.

News September 29, 2024

KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు

image

TG: హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ రూ.826 కోట్లతో 6 జంక్షన్లను ప్రభుత్వం నిర్మించనుంది. రెండు ప్యాకేజీలుగా నిర్మించే ఈ ప్రాజెక్ట్‌లో మొదటిగా 2 ఫ్లైఓవర్లు, 3 అండర్‌పాస్‌లు, సెకండ్ ప్యాకేజీలో 4 ఫ్లైఓవర్లు, 4 అండర్‌పాస్‌లు అభివృద్ధి చేయనుంది. ఈ నిర్మాణాలు పూర్తైతే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, యూసుఫ్‌గూడ ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యలు తొలగనున్నాయి.

News September 29, 2024

మంత్రి ఉత్తమ్‌‌కు పితృవియోగం

image

TG: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పితృవియోగం కలిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి పురుషోత్తంరెడ్డి కన్నుమూశారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు.