News April 7, 2025

నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

image

ఆరోగ్యమే మహాభాగ్యమన్న నానుడి నూటికి నూరుపాళ్లు నిజం. ఏ భయం లేకుండా ఏదైనా తినగలగడం, దాన్ని అరాయించుకోగలగడం, హాయిగా నిద్రపోవడం.. వీటి తర్వాతే మనిషికి ఏ ఆస్తైనా. బీపీలు, షుగర్లు, దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్ల నొప్పులు, క్యాన్సర్లు.. ఒకటేమిటి ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు అనేక రకాల మహమ్మార్లు కాచుకుని ఉన్నాయి. ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్నవారే అదృ‌ష్టవంతులు. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.

Similar News

News April 9, 2025

ప్రముఖ నిర్మాత మృతి

image

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సలీమ్ అక్తర్(87) నిన్న అర్ధరాత్రి మరణించారు. అనారోగ్య సమస్యలతో ముంబైలోని ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాణీ ముఖర్జీ, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే. ఆమిర్ ఖాన్, బాబీ డియోల్, మిథున్ చక్రవర్తి తదితర అగ్ర నటులతో సినిమాలు చేశారు. కాగా ఇటీవల ప్రముఖ ప్రొడ్యూసర్ మనోజ్ కుమార్ కూడా మృతిచెందిన విషయం తెలిసిందే.

News April 9, 2025

దేశానికి కాంగ్రెస్ చాలా అవసరం: షర్మిల

image

AP: దేశానికి కాంగ్రెస్ పార్టీ అత్యవసరమని APCC అధ్యక్షురాలు YS షర్మిల అన్నారు. అహ్మదాబాద్‌లో AICC సమావేశాల సందర్భంగా ఆమె బీజేపీపై మండిపడ్డారు. ‘బీజేపీ చేసేవే మత రాజకీయాలు. దేశ ప్రజల్ని విభజించి పాలించడమే ఆ పార్టీకి తెలుసు. మతం పేరిట మంట పెట్టి చలి కాచుకుంటోంది. వ్యవస్థల్ని సొంత అవసరాలకు వాడుకుంటోంది. కాంగ్రెస్‌తోనే ఈ దేశ అభివృద్ధి సాధ్యం. ఏపీలో కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తాం’ అని పేర్కొన్నారు.

News April 9, 2025

సూక్ష్మ సేద్యంలో AP నంబర్-1

image

AP: FY25లో 1.17L హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అమలు చేసి దేశంలోనే ఏపీ నంబర్‌-1గా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్(1.16L హెక్టార్లు), UP(1.02L హె,), కర్ణాటక(97K హె,) TN(91K హె,) ఉన్నాయి. బిందు, తుంపర్ల పరికరాల కోసం కేంద్రం, AP ప్రభుత్వాలు, రైతులు కలిసి ₹1,176Cr వెచ్చించారు. దేశంలో ఈ పరికరాలు అత్యధికంగా ఉన్న తొలి 10 జిల్లాల్లో అనంతపురం, కడప, సత్యసాయి, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు ఉన్నాయి.

error: Content is protected !!