News March 4, 2025

నేడు ప్రపంచ ఊబకాయ దినోత్సవం

image

మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ప్రధాన మహమ్మారి ఊబకాయమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే దానిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఊబకాయ ఫెడరేషన్ 2015 నుంచి మార్చి 4ను ఊబకాయ అవగాహనా దినోత్సవంగా నిర్వహిస్తోంది. ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు జనం ఊబకాయంతో బాధపడుతున్నట్లు అంచనా. మధుమేహం, గుండె జబ్బులు, బీపీ, లివర్, ఊపిరితిత్తుల సమస్యలు, గ్యాస్ట్రిక్, ఎముకల అనారోగ్యాలకు ఊబకాయం కారణమవుతోంది.

Similar News

News March 4, 2025

ఎమ్మెల్సీ కౌంటింగ్: రసవత్తర పోటీ

image

TG: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 6712, నరేందర్ రెడ్డి (కాంగ్రెస్) 6676, ప్రసన్న హరికృష్ణ 5867, రవీందర్ సింగ్‌ 107, మహమ్మద్ ముస్తాక్ అలీకి 156 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెండో రౌండ్ లెక్కింపు ప్రారంభమైందన్నారు.

News March 4, 2025

LIC సంపద ₹1.45లక్షల కోట్లు ఆవిరి

image

స్టాక్‌మార్కెట్ల పతనంతో LIC స్టాక్ పోర్టుఫోలియో విలువ ఏకంగా ₹1.45లక్షల కోట్లు తగ్గిపోయింది. 2024 DECలో ₹14.9లక్షల కోట్లుగా ఉన్న విలువ ఇప్పుడు ₹13.4లక్షల కోట్లకు చేరుకుంది. ITCలో ₹17,007CR, TCSలో ₹10,509CR, SBIలో ₹8,568CR, INFYలో ₹7640CR, LTలో ₹7605CR మేర నష్టపోయింది. 310కి పైగా కంపెనీల్లో LIC ఒక శాతానికి పైగా పెట్టుబడి పెట్టింది. RILలో అత్యధికంగా ₹1.03L CR, ITCలో ₹75,780L CR హోల్డింగ్స్ ఉన్నాయి.

News March 4, 2025

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు Shocking News

image

AIతో సగం ఉద్యోగులతోనే డబుల్ రెవెన్యూ సాధించాలని టీమ్స్‌ను సవాల్ చేస్తున్నామని HCL టెక్ CEO<<15647926>> విజయ్<<>> కుమార్ చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. Infy CEO సలిల్ పారేఖ్ ఆయనతో ఏకీభవించడం మరింత భయపెడుతోంది. కంపెనీలన్నీ AI దారి అనుసరిస్తే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో సగం మందికి జాబ్స్ పోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వెస్ట్ నుంచి ప్రాజెక్టులు తగ్గి రెవెన్యూ మందగించిన వేళ మరెన్ని దుర్వార్తలు వినాల్సి వస్తోందో!

error: Content is protected !!