News November 30, 2024
ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలకు జగన్ లీగల్ నోటీసులు

AP: ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలకు మాజీ CM జగన్ లీగల్ నోటీసులు పంపించారు. సెకీ, ఏపీ ప్రభుత్వం మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాలపై తప్పుడు కథనాలు ప్రచురించారని, అందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. తప్పుడు కథనాలతో తన ప్రతిష్ఠ దెబ్బతిందని, క్షమాపణ చెప్పినట్లు పేపర్ మొదటి పేజీలో ప్రచురించాలని జగన్ డిమాండ్ చేశారు.
Similar News
News November 9, 2025
‘ఎలుకల దాడి’పై మంత్రి సత్యకుమార్ సీరియస్

AP: ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను ఎలుకలు కరవడంపై మంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు. హాస్టల్ వార్డెన్, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేటు ఏజెన్సీకి నోటీసులు జారీ చేయాలని DME రఘునందన్ను ఆదేశించారు. హాస్టల్ వార్డెన్ వివరణ కోరుతూ మెమో ఇవ్వాలని కాలేజీ ప్రిన్సిపల్ను ఆదేశించారు. కాగా హాస్టల్లోని పరిస్థితులపై తనిఖీ చేస్తున్నామని డీఎంఈ మంత్రికి తెలియజేశారు.
News November 9, 2025
తాజా వార్తలు

☛ పేదరికం లేని సమాజమే నా లక్ష్యం. సంజీవని పథకం ద్వారా ఇంటి దగ్గరే వైద్యం అందిస్తాం. గ్రామాల్లో 5వేల వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తాం: CM చంద్రబాబు
☛ యాదగిరిగుట్టకు రూ.1,00,57,322 రికార్డ్ ఆదాయం. ఇవాళ ఆలయాన్ని దర్శించుకున్న 78,200మంది భక్తులు
☛ బిహార్లో మరోసారి ఎన్డీయేదే అధికారం: మంత్రి లోకేశ్
☛ నిన్నటి దాకా CM రేసులో భట్టి ఉండేవారు. ఇప్పుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా వచ్చారు: జగదీశ్ రెడ్డి
News November 9, 2025
నిద్ర సమయంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

అధిక రక్తపోటు లక్షణాలు ఎక్కువగా రాత్రిపూట నిద్రపోతున్న సమయంలో కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫ్యాన్/ఎయిర్ కండిషనర్ ఉన్నా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచూ మూత్ర విసర్జన, దీర్ఘకాలిక అలసట, తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, ముక్కు నుంచి రక్తం కారడం, ఛాతి నొప్పి, తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.


