News June 13, 2024

ఇవాళ లాసెట్, పీజీ ఎల్‌సెట్ ఫలితాలు

image

TG: న్యాయ కళాశాలల్లో LLB, LLM కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. జూన్‌ 3న నిర్వహించిన ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి మ.3.30 గంటలకు రిలీజ్ చేస్తారు.

Similar News

News January 18, 2026

20న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్.. FEB 12న పోలింగ్?

image

TG: జనవరి 20న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 12న పోలింగ్ నిర్వహించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది. కాగా సమ్మక్క-సారలమ్మ కొలువైన మేడారంలో తొలిసారి మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. 2027 గోదావరి పుష్కరాలతో పాటు రైతుభరోసాపై మంత్రులు చర్చిస్తున్నారు.

News January 18, 2026

టీడీపీని ఈ గడ్డపైకి తెచ్చే పన్నాగాలను జనం తిప్పికొడతారు: కేటీఆర్

image

TG: బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చివేయాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై KTR ఫైరయ్యారు. ‘సీఎంగానే కాదు హోంమంత్రిగా ఉన్నావన్న సోయి లేకుండా BRS జెండా గద్దెలను ధ్వంసం చేయాలంటావా? శాంతిభద్రతల్లో పదేళ్లు దేశానికి ఆదర్శంగా నిలిచిన TGలో ఇప్పుడు అరాచకాలు చేసేవారు రాజ్యమేలడం ఓ దరిద్రం. బీఆర్ఎస్‌ను ఎదుర్కోలేక BJPతో చీకటి ఒప్పందాలు, టీడీపీని తిరిగి ఈ గడ్డపైకి తెచ్చే నీ పన్నాగాలను ప్రజలు తిప్పికొడుతారు’ అని మండిపడ్డారు.

News January 18, 2026

హీరో ధనుష్‌తో పెళ్లి.. మృణాల్ టీమ్ రియాక్షన్ ఇదే

image

వచ్చే నెల 14న తమిళ హీరో ధనుష్‌తో <<18863331>>పెళ్లి<<>> అంటూ జరుగుతున్న ప్రచారానికి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ టీమ్ తెరదించింది. ‘మృణాల్ వచ్చే నెలలో పెళ్లి చేసుకోవట్లేదు. ఎలాంటి కారణం లేకుండానే ఈ ప్రచారం జరుగుతోంది’ అని పేర్కొంది. అది పూర్తిగా తప్పుడు ప్రచారమని, ఎవరూ నమ్మొద్దని సూచించింది. కాగా ఇప్పటివరకు మృణాల్ గానీ ధనుష్ గానీ ఈ ప్రచారంపై స్పందించకపోవడం గమనార్హం.