News June 30, 2024
నేడు పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు

AP: అంతర్జాతీయ నిపుణుల బృందం నేడు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు రానుంది. అమెరికా, కెనడా నుంచి నలుగురు నిపుణులు 4 రోజుల పాటు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు, డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాలపై ఫోకస్ చేయనున్నారు. అక్కడి నిర్మాణాల్లో ఎదురయ్యే సవాళ్లపై అధ్యయనం చేస్తారు. ఆపై జలసంఘం నిపుణులు, అధికారులతో రెండ్రోజుల పాటు చర్చించి నివేదికను అందిస్తారు.
Similar News
News October 28, 2025
పంట నష్టాన్ని రైతులు నమోదు చేసేలా యాప్లో మార్పులు: CM CBN

AP: పంట నష్టాన్ని రైతులు పంపేలా వ్యవసాయశాఖ యాప్ను మార్చాలని CM CBN ఆదేశించారు. పంట నష్టం సహ వర్షాన్ని అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలన్నారు. ‘కాకినాడకు మరిన్ని రెస్క్యూ బృందాలు పంపాలి. సీమలో వర్షాలు లేనందున చెరువుల్లో నీటిని నింపాలి’ అని సూచించారు. 43వేల హెక్టార్ల పంట నీట మునిగిందని అధికారులు నివేదించారు. 81 టవర్లతో వైర్లెస్ సిస్టమ్, 2703 జనరేటర్లు రెడీ చేశామన్నారు.
News October 28, 2025
భారీ వర్షాలు.. కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కోళ్లకు వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. అందుకే కోళ్ల ఫారాన్ని శుభ్రంగా ఉంచాలి. ఫారం నుంచి నీరు బయటకు పోయేలా డ్రైనేజ్ సక్రమంగా ఉండేట్లు చూసుకోవాలి. కోళ్లకు నీరందించే నీటి బుట్టలు లీక్ కాకుండా సరి చూడాలి. లిట్టర్ బాగా తడిగా ఉంటే దాన్ని వెంటనే తొలగించాలి. ఫారంలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. కోళ్లలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెటర్నరీ డాక్టరును సంప్రదించాలి.
News October 28, 2025
బాలీవుడ్ నటుడి మంచి మనసు

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మంచి మనసు చాటుకున్నారు. ‘రామాయణ’ సినిమాకు తాను తీసుకుంటున్న పారితోషికాన్ని క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారుల వైద్యానికి వినియోగించనున్నట్లు వెల్లడించారు. హాలీవుడ్ మాస్టర్ పీస్ చిత్రాలకు భారత్ నుంచి సమాధానంగా ‘రామాయణ’ నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంకొన్ని రోజులు తన పాత్ర షూట్ మిగిలి ఉందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


