News September 15, 2024
నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లనున్నారు. మ.12 గంటలకు చిన్నచింతకుంట మండలంలో పర్యటిస్తారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి దశదినకర్మకు హాజరుకానున్నారు. అనంతరం మ.2.45కు గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ గౌడ్ బాధ్యతలు తీసుకునే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఇందిరా భవన్ ముందు నిర్వహించే సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Similar News
News November 13, 2025
అల్ ఫలాహ్ వర్సిటీకి షాక్

ఉగ్ర మూలాలు బయటపడిన ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ వర్సిటీపై అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్(AIU) చర్యలు తీసుకుంది. సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వెంటనే లోగోను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కళాశాలకు గుర్తింపు ఉందంటూ వెబ్సైట్లో ప్రదర్శించినందుకు వర్సిటీకి న్యాక్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీకి ఫండింగ్, డాక్టర్ల ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేయనుంది.
News November 13, 2025
ప్రేమ అర్థాన్ని కోల్పోయింది: అజయ్ దేవగణ్

ప్రేమ అర్థాన్ని కోల్పోయిందని బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ అన్నారు. ‘ప్రేమ అనే పదాన్ని అనవసరంగా ఉపయోగిస్తున్నారు. దాని డెప్త్‌ను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రతి మెసేజ్‌కు హార్ట్ ఎమోజీ పెడుతున్నారు. అన్ని మెసేజ్‌లు లవ్‌తో ముగుస్తున్నాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పెళ్లికి ఎక్స్పైరీ డేట్, రెన్యువల్ ఉండాలని అజయ్ భార్య <<18269284>>కాజోల్<<>> చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఇలా చెప్పడం గమనార్హం.
News November 13, 2025
క్యురేటర్‌తో గంభీర్, గిల్ సుదీర్ఘ చర్చ.. పిచ్‌పై అసంతృప్తి?

కోల్‌కతా వేదికగా రేపటి నుంచి భారత్, సౌతాఫ్రికా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ క్యురేటర్ సుజన్ ముఖర్జీతో కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ సుదీర్ఘంగా చర్చించారు. ఇవాళ ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా పిచ్‌ను కోచింగ్ టీమ్, BCCI క్యురేటర్లు, గిల్, పంత్ తదితరులు పరిశీలించారు. తర్వాత 30 నిమిషాలపాటు డిస్కషన్ జరిగింది. పిచ్ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.


