News December 3, 2024
నేడు వరద నీటి సంపుల నిర్మాణం ప్రారంభం

TG: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నేడు సచివాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి వరద నీటి సంపుల నిర్మాణాలను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో ఈ పనులు చేపట్టనున్నారు. ఒక్కో సంపు సామర్థ్యం లక్ష లీటర్ల నుంచి 10 లక్షల లీటర్ల వరకు ఉండనుంది. వర్షాల సమయంలో వరద నీటిని రోడ్ల మీద నుంచి సంపులోకి పంపి అక్కడి నుంచి పైపుల ద్వారా కాలువల్లోకి మళ్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Similar News
News November 16, 2025
చొప్పదండి: డ్రంక్ అండ్ డ్రైవ్ ఫైన్‌కు భయపడి యువకుడి ఆత్మహత్య

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఫైన్ చెల్లించలేనన్న మనోవేదనతో చొప్పదండి బీసీ కాలనీకి చెందిన సూర విజయ్ (28) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ నరేష్ రెడ్డి తెలిపారు. ఈ నెల 1న పోలీసులకు పట్టుబడిన విజయ్, శనివారం కోర్టుకు హాజరైనప్పటికీ మేజిస్ట్రేట్ లేకపోవడంతో తిరిగి వచ్చాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫైన్ భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
News November 16, 2025
ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*17 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
*విశాఖ స్టీల్ ప్లాంటును తెల్ల ఏనుగుతో పోల్చిన చంద్రబాబు
*ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన సీఎం రేవంత్, MLA నవీన్ యాదవ్
*హిందూపురంలో మా కార్యాలయంపై టీడీపీ దాడి చేసింది: వైఎస్ జగన్
*రాజమౌళి-మహేశ్ బాబు సినిమా టైటిల్ ‘వారణాసి’.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్
*సౌతాఫ్రికాతో టెస్టు.. విజయానికి చేరువలో భారత్
News November 16, 2025
పాకిస్థాన్ నుంచి డ్రోన్లతో బాంబులు, డ్రగ్స్ సరఫరా

పాక్ నుంచి డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు, ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా చైన్‌ను NIA రట్టు చేసింది. ప్రధాన వ్యక్తి విశాల్ ప్రచార్ అరెస్టు చేసి తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. పాక్ బార్డర్లలో డ్రోన్ల ద్వారా వచ్చే ఆర్మ్స్, డ్రగ్స్, అమ్మోనియం వంటి వాటిని గ్యాంగుల ద్వారా పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌కు చేరవేస్తున్నారని పేర్కొంది. సామాజిక అస్థిరత సృష్టించేలా ఈ గ్యాంగులు పనిచేస్తున్నాయని NIA వివరించింది.


