News July 18, 2024

శ్రీలంకతో సిరీస్‌కు నేడు భారత జట్టు ప్రకటన!

image

శ్రీలంకతో T20, వన్డే సిరీస్ కోసం భారత జట్టును BCCI ఇవాళ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ ఆడే ఛాన్స్ ఉంది. హార్దిక్, బుమ్రా, కోహ్లీలకు రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే T20లకు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించనున్నట్లు టాక్. ఈ నెల 27న తొలి T20, 28న రెండో మ్యాచ్, 30న మూడో T20 జరగనుంది. ఆగస్టు 2న తొలి వన్డే, 4న రెండో మ్యాచ్, 7న చివరి వన్డే జరగనుంది.

Similar News

News January 27, 2026

ఇవాళ సా.4 గంటలకు ఎన్నికల షెడ్యూల్

image

TG: ఇవాళ సాయంత్రం 4 గంటలకు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. ఆ వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరగనున్నాయి.

News January 27, 2026

కాల్పులు ఆపాలని పాక్ వేడుకుంది.. UNలో ఇండియా కౌంటర్

image

ఇండియాకు, ఇండియాలోని ప్రజలకు హాని కలిగించడమే పాక్ ఏకైక అజెండా అని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ UN వేదికగా మండిపడ్డారు. ‘మే 10న కాల్పుల విరమణ కోసం పాక్ వేడుకుంది. మా ఆపరేషన్‌లో పాక్ ఎయిర్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. అందుకు సంబంధించిన ఫొటోలు పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయి’ అని చెప్పారు. ఇండియా చేపట్టిన OP సిందూర్‌కు తాము బదులిచ్చామంటూ UNSCలో పాక్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

News January 27, 2026

DRDOలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

హైదరాబాద్‌లోని <>DRDO<<>>కు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ &డెవలప్‌మెంట్ లాబోరేటరీలో అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. ఐటీఐ అర్హతగల అభ్యర్థులు www.apprenticeshipindia.gov.in పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తును, డాక్యుమెంంట్స్‌ను కంచన్‌బాగ్‌లోని DRDLకు పోస్ట్ చేయాలి. వెబ్‌సైట్: https://www.drdo.gov.in