News October 6, 2024

నేడు సింహవాహనంపై ఊరేగనున్న స్వామివారు

image

AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజైన ఇవాళ ఉ.8 నుంచి 10 గంటల వరకు స్వామివారు సింహవాహనంపై ఊరేగుతారు. రా.7 నుంచి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంలో వేణుగోపాలుడి అలంకారంలో ఊరేగనున్నారు.

Similar News

News December 26, 2025

నారదుడు ఎప్పుడూ ఎందుకు తిరుగుతుంటాడు?

image

నారద ముని ఒకచోట నిలకడగా ఉండలేరన్న విషయం మనకు తెలిసిందే. అయితే దీని వెనుక ఒక రహస్యం ఉంది. సృష్టి కార్యంలో భాగంగా దక్ష ప్రజాపతి కుమారులు సంసారంలో పడకుండా, నారదుడు వారికి వైరాగ్యాన్ని బోధించి సన్యాసులుగా మారుస్తాడు. దీనితో కోపించిన దక్షుడు, నారదుడు ఎక్కడా రెండు గడియల కంటే ఎక్కువ సేపు నిలబడకుండా ఉండేలా శాపం ఇస్తాడు. అది లోకకల్యాణానికి దారి తీసింది.

News December 26, 2025

చెర్రీ-సుకుమార్ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి?

image

కాంతార ఛాప్టర్-1లో మెరిసిన రుక్మిణి వసంత్ త్వరలో పట్టాలెక్కనున్న చెర్రీ-సుకుమార్ సినిమాలో హీరోయిన్‌గా చేయనున్నట్లు టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే సమ్మర్‌లో ఈ మూవీ స్టార్ట్ అయ్యే ఛాన్సుంది. ప్రస్తుతం చరణ్ ‘పెద్ది’లో నటిస్తుండగా, తారక్-నీల్ సినిమాలో రుక్మిణి వర్క్ చేస్తున్నారు. కాగా తెలుగులో చరణ్, తారక్ నటన అంటే తనకు ఇష్టమని ఓ ఈవెంట్లో రుక్మిణి చెప్పిన మాటలను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.

News December 26, 2025

నేడు 3వ T20.. భారత్ సిరీస్ పట్టేస్తుందా?

image

ఉమెన్స్: 5 మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్, శ్రీలంక మధ్య ఇవాళ 3వ T20 తిరువనంతపురంలో జరగనుంది. తొలి రెండో T20ల్లో టీమ్ఇండియా ఘన విజయాలు సాధించింది. అదే ఫామ్‌ కంటిన్యూ చేస్తూ ఇవాళ్టి మ్యాచులోనూ నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. అటు శ్రీలంక సైతం సిరీస్‌లో తొలి విజయం కోసం నిన్న నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. 7pmకు JioHotstar, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్ స్ట్రీమింగ్ కానుంది.