News December 9, 2024

నేడు, రేపు ‘కళా ఉత్సవ్’ రాష్ట్రస్థాయి పోటీలు

image

AP: విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేలా నేడు, రేపు రాష్ట్రస్థాయి ‘కళా ఉత్సవ్’ పోటీలు విజయవాడలో జరగనున్నాయి. మిమిక్రీ, ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్, ఓకల్ మ్యూజిక్, జానపద కీర్తనలు- నృత్యం, క్లాసికల్ డాన్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. 9, 10, ఇంటర్ విద్యార్థులు వ్యక్తిగత, గ్రూప్ విభాగాల్లో పాల్గొంటారు. సత్తా చాటిన వారిని జనవరి 2 నుంచి 7 వరకు భోపాల్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపుతారు.

Similar News

News November 23, 2025

తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో తెలంగాణ వంటల వారసత్వ వాక్

image

ప్రపంచ వారసత్వ వారోత్సవాల సందర్భంగా తెలంగాణ టూరిజం ‘తెలంగాణ వంటల వారసత్వ వాక్‌’ను చార్మినార్‌‌లో ప్రారంభించింది. వంటకాల రుచి, తయారీ పద్ధతులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. తెలంగాణ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి, ఫుడ్ స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. వంటకాల రుచిని ఆస్వాదిస్తూ, వాటి వెనుక ఉన్న కథలను, చరిత్రను తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

News November 23, 2025

తల్లి పాలల్లో యురేనియం ఆనవాళ్లు.. కానీ!

image

ఈ ప్రపంచంలో తల్లి పాలను మించిన పోషకాహారం లేదు. కానీ మారిన వాతావరణ పరిస్థితులతో వాటిలోనూ రసాయనాలు చేరుతున్నాయి. తాజాగా బిహార్ తల్లుల పాలల్లో యురేనియం(5ppb-పార్ట్స్ పర్ బిలియన్) ఆనవాళ్లు గుర్తించినట్లు NDMA సైంటిస్ట్ దినేశ్ వెల్లడించారు. అయితే WHO అనుమతించిన స్థాయికంటే తక్కువగానే ఉన్నాయని, దీనివల్ల ప్రస్తుతానికి ప్రమాదం లేదని చెప్పారు. నీటిలో మాత్రం 6 రెట్లు ఎక్కువగా యురేనియం ఆనవాళ్లు ఉన్నాయన్నారు.

News November 23, 2025

పొల్యూషన్​ నుంచి కాపాడే ఫుడ్స్ ఇవే

image

ప్రస్తుతం వాయుకాలుష్యం పెద్ద సమస్యగా మారింది. లైంగిక పరిపక్వత, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక సమస్యలు వస్తున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే బెర్రీస్, బ్రోకలీ, పసుపు, ఆకుకూరలు, చేపలు ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు కలిగిన విభిన్న ఆహారాలను చేర్చుకోవడం వల్ల కాలుష్యం నుంచి మిమ్మల్ని రక్షించుకోగలుగుతారని చెబుతున్నారు.