News May 22, 2024
ఐపీఎల్లో నేడు ఎలిమినేటర్ మ్యాచ్.. గెలిచేదెవరు?

రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ మధ్య నేడు రాత్రి 7:30కి అహ్మదాబాద్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఈనెల 24న SRHతో క్వాలిఫయర్-2 ఆడుతుంది. ఓడిన జట్టు టైటిల్ రేసు నుంచి ఎలిమినేట్ అవుతుంది. వరుస విజయాలతో ఆర్సీబీ జోరు మీదుండగా, వరుస పరాజయాలతో RR కాస్త సన్నగిల్లిన విశ్వాసంతో ఉంది. మరి ఈ కీలక సమరంలో గెలుపెవరిది? కామెంట్ చేయండి.
Similar News
News January 21, 2026
‘బంగారు’ భవిష్యత్తు కోసం చిన్న పొదుపు!

ప్రస్తుతం బంగారం ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. అందుకే ఒకేసారి కొనలేకపోయినా ప్రతిరోజూ చిన్న మొత్తంలో డిజిటల్ గోల్డ్ కొనడం లేదా జువెలరీ షాపుల స్కీమ్స్‌లో చేరడం మంచిది. ఇప్పుడు గోల్డ్ SIPల ద్వారా రోజుకు రూ.30 నుంచే బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టొచ్చు. ఇలా జమ చేయడం వల్ల భవిష్యత్తులో పెరిగే ధరల లాభం మీకే దక్కుతుంది. భారీ పెట్టుబడి అవసరం లేకుండానే చిన్న పొదుపుతోనే ఎంతో కొంత బంగారం కొనొచ్చు.
News January 21, 2026
గనుల కేటాయింపుపై ఎంక్వైరీకి సిద్ధమా.. పొన్నం సవాల్

TG: సింగరేణి గనుల కేటాయింపులపై హరీశ్ రావు, కేటీఆర్ చేస్తున్న ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. 2014 నుంచి 2026 వరకు జరిగిన గనుల కేటాయింపులపై ఎంక్వైరీకి సిద్ధమని, మరి మీరు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ బీజేపీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్కు బుద్ధి చెబుతారని మంత్రి వ్యాఖ్యానించారు.
News January 21, 2026
మహిళల్లో ఈస్ట్రోజన్ తగ్గితే..

అవయవాల పనితీరును సమన్వయపరిచే హార్మోన్లలో ఈస్ట్రోజన్ ఒకటి. ఇది తగ్గడం వల్ల మహిళల్లో నెలసరి అస్తవ్యస్తం, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, తలనొప్పి, చర్మం పొడిబారడం, అధికబరువు వంటి సమస్యలు వస్తాయి. ఈస్ట్రోజన్ పెరగాలంటే టోపు, సోయా, బఠాణీలు, అప్రికాట్స్, బ్రొకొలి, కాలీఫ్లవర్, ఫ్లాక్స్, గుమ్మడి సీడ్స్, పెసర మొలకలు తినాలి. తక్కువ బరువు ఉన్నా, అవసరానికి మించి వ్యాయామం చేసినా ఈస్ట్రోజన్ తగ్గుతుంది.


