News June 29, 2024

ఇవాళ్టి గోల్డ్ రేట్స్

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల రేట్ రూ.120 పెరిగి రూ.72,280గా ఉంది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.100 పెరిగి రూ.66,250కి చేరింది. అటు కేజీ వెండి ధర రూ.94,500గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Similar News

News January 19, 2026

కుప్పం: చెరువులో పడి మహిళ ఆత్మహత్య

image

కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని NTR కాలనీకి చెందిన చలపతి భార్య ప్రభావతమ్మ (54) చీలేపల్లి చెరువులో పడి మృతి చెందింది. అనారోగ్య కారణాల నేపథ్యంలో ఆమె ఆదివారం చెరువులో పడినట్లు స్థానికులు తెలిపారు. చెరువు నుంచి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 19, 2026

‘రాజాసాబ్’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?

image

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో విడుదలైన 10 రోజుల్లో ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.139.25 కోట్లు(నెట్) వసూలు చేసినట్లు Sacnilk తెలిపింది. నిన్న ఈ సినిమా రూ.2.50 కోట్లు రాబట్టినట్లు అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో రూ.180 కోట్ల నెట్ కలెక్షన్స్ దాటినట్లు సినీ వర్గాలు తెలిపాయి.

News January 19, 2026

ECILలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

హైదరాబాద్‌లోని <>ECIL<<>>లో 20 టెక్నీషియన్, సూపర్‌వైజర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్+వైవా ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ecil.co.in