News March 23, 2024

ఈరోజు హెడ్‌లైన్స్

image

* అట్టహాసంగా IPL ప్రారంభం
* CM కేజ్రీవాల్‌కు ఈనెల 28వరకు రిమాండ్
* AP: పిఠాపురం నుంచే పవన్ ఎన్నికల ప్రచారం
* TG: ఈ నెల 24న తెలంగాణ బంద్‌‌కు మావోయిస్టుల పిలుపు
* AP: మూడో జాబితా ప్రకటించిన టీడీపీ
* TG: ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ: మంత్రి జూపల్లి
* ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలు త్వరలో పెంపు
* AP: పురందీశ్వరి రాజీనామా వార్త అవాస్తవం: బీజేపీ
* BJP నాలుగో జాబితా విడుదల

Similar News

News March 3, 2026

సాయుధుల ఊచకోత.. 169 మంది మృతి

image

దక్షిణ సూడాన్‌లోని ఓ గ్రామంలో సాయుధులు జరిపిన దాడిలో 169 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్యుద్ధంలో భాగంగా ప్రతిపక్ష నేత రీక్ మచర్‌ మద్దతుదార్లు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 90 మంది సాధారణ పౌరులు చనిపోయారని.. మృతుల్లో పిల్లలు, మహిళలు ఉన్నట్లు UN మిషన్ వెల్లడించింది. ఈ దాడి తర్వాత వెయ్యి మంది తమను ఆశ్రయించినట్లు తెలిపింది. చర్చల ద్వారా ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేతలు సంధి కుదుర్చుకోవాలని కోరింది.

News March 3, 2026

బిజినెస్ ఫ్రెండ్లీ దేశంగా భారత్

image

వ్యాపారానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్న దేశంగా భారత్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇన్నోవేటర్స్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్ 2026లో భారత్ 55.035 స్కోర్‌తో 54 ర్యాంక్ సాధించింది. చైనా (85) కంటే మెరుగైన స్థానంలో ఉంది. దక్షిణాసియాలోనూ మనమే టాప్. కాస్ట్ ఆఫ్ లివింగ్, మార్కెట్ సైజ్, లేబర్ చట్టాల ఆధారంగా ఈ సూచీలో ర్యాంకింగ్స్ ఇస్తారు. ఇక టాప్-3లో అమెరికా, సింగపూర్, యూకే ఉన్నాయి.

News March 3, 2026

మరో ఐదు S-400 కొనేందుకు భారత్ ప్లాన్!

image

డిఫెన్స్ సిస్టమ్స్ బలోపేతంలో భాగంగా భారత్ రష్యా నుంచి మరో ఐదు S-400 స్క్వాడ్రన్లు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిని రక్షణ శాఖ త్వరలో ఆమోదించే అవకాశం ఉంది. S-400తో పాటు పలు మిసైళ్లను కొనుగోలు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఆపరేషన్ సిందూర్ టైమ్‌లో S-400 కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 2018లో ఐదు S-400 స్క్వాడ్రన్లను భారత్ ఆర్డర్ చేయగా ఇప్పటికి మూడే వచ్చాయి. మరో రెండు రావాల్సింది.