News March 15, 2025

ఇవాళ అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత

image

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ఇవాళ తెలంగాణలో అత్యధికంగా కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 39.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. అటు ఏపీలో అత్యధికంగా నంద్యాల జిల్లా గోస్పాడు, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 5 రోజుల పాటు వడగాలులు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపింది.

Similar News

News January 19, 2026

YCP ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఇప్పటికే ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈ నెల 22న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.

News January 19, 2026

బంధంలో బ్యాలెన్స్ ముఖ్యం

image

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతోనో, నలుగురూ వేలెత్తి చూపుతారన్న భయంతోనో నిరంతరం అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్న వారవుతారు. కాబట్టి బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్‌డ్‌గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

News January 19, 2026

వరిలో కాండం తొలిచే పురుగు నివారణ ఎలా?

image

వరి నారుమడి దశలో కాండం తొలిచే పురుగును గుర్తిస్తే నారుమడిలో కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు లేదా 600 గ్రా. ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలి. ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న, పిలకదశలో ఉన్న వరిపైరులో తప్పకుండా ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు 10KGలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8KGలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4G గుళికలు 4kgలను 20-25 కిలోల ఇసుకలో కలిపి బురద పదునులో వేయాలి.