News August 16, 2025
నేటి ముఖ్యాంశాలు

★ దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవాలు
★ ఎర్రకోట నుంచి పాకిస్థాన్‌కు PM మోదీ హెచ్చరిక
★ ప్రజలపై GST భారాన్ని భారీగా తగ్గిస్తాం: మోదీ
★ APలో ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు పథకం ప్రారంభం
★ ‘సూపర్ సిక్స్’ హామీలు సూపర్ హిట్: చంద్రబాబు
★ నేను దావత్‌ల కోసం ఢిల్లీ వెళ్లట్లేదు: రేవంత్
★ నీటి వాటాలపై AP, TG CMల హాట్ కామెంట్స్
★ ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపేస్తేనే రష్యాతో వ్యాపారం: ట్రంప్
Similar News
News August 17, 2025
రవితేజ ‘మాస్ జాతర’ విడుదల వాయిదా?

మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 27న రిలీజ్ కావాల్సిన ఈ మూవీని అక్టోబర్ 20కి పోస్ట్‌పోన్ చేస్తారని సమాచారం. సినీ కార్మికుల సమ్మె వల్ల పెండింగ్ వర్క్ పూర్తి కాలేదని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.
News August 17, 2025
సీఎంతో పీసీసీ చీఫ్ భేటీ

TG: సీఎం రేవంత్ రెడ్డితో ఈ ఉదయం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సందిగ్ధత, ఎన్నికల నిర్వహణకు కోర్టు విధించిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల నిర్వహణపై ఓ క్లారిటీ వచ్చేందుకు కీలకంగా భావిస్తున్న PAC సమావేశం తేదీ ఖరారుపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం.
News August 17, 2025
చికెన్ బోన్స్ తింటున్నారా?

చాలామంది చికెన్‌తో పాటు ఎముకలను నమిలేస్తుంటారు. బోన్స్ తింటే జీర్ణ సమస్యలు రావొచ్చని, కృత్రిమంగా పెరిగిన కోళ్ల ఎముకలతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి జీర్ణమయ్యేందుకు టైమ్ పడుతుందని, పేగులలో అడ్డంకులు ఏర్పడొచ్చని అంటున్నారు. ఎముకలు అన్నవాహిక, శ్వాసనాళంలో చిక్కుకునే అవకాశముంటుందని, శ్వాసనాళంలో ఇరుక్కుపోతే ఊపిరాడక ఇబ్బంది ఎదురవ్వొచ్చని పేర్కొంటున్నారు. SHARE IT.