News August 21, 2025
నేటి ముఖ్యాంశాలు

⋆ లోక్‌సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం
⋆ జైలుకెళ్లిన మంత్రుల తొలగింపు బిల్లుపై సభలో దుమారం
⋆ ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి
⋆ భవిష్యత్తులో 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం: CM రేవంత్
⋆ పేదలకు ఇళ్లు.. స్థలాలు గుర్తించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు
⋆ కర్నూలు జిల్లాలో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి
⋆ మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను తొలగించిన జియో
Similar News
News August 21, 2025
విజ్డన్ ప్లేయర్స్‌లో నంబర్ వన్‌గా జైస్వాల్

ప్రపంచంలోనే బెస్ట్ యంగ్ ప్లేయర్‌గా టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ నిలిచారు. విజ్డన్ టాప్-40 ర్యాంకింగ్స్‌లో జైస్వాల్ టాప్‌లో నిలిచారు. సాయి సుదర్శన్ (9), నితీశ్ (12), తిలక్ వర్మ (14), వైభవ్ (16), హర్షిత్ (21), పరాగ్ (27), ముషీర్ (31), మయాంక్ (33) స్థానాలు దక్కించుకున్నారు. టాప్-10లో జేడెన్ సీల్స్, బెతేల్, ఒరూర్కీ, ప్రిటోరియస్, నసీమ్ షా, గుర్బాజ్, మఫాకా, ఇబ్రహీం జద్రాన్ నిలిచారు.
News August 21, 2025
శ్రీశైలం ఘటనపై పవన్ కళ్యాణ్ సీరియస్

AP: శ్రీశైలం ఫారెస్ట్ అధికారులపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని Dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ ఘటనపై సవివరంగా నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు సూచించారు. ‘తాము తప్పు చేసినా ఉపేక్షించొద్దని చంద్రబాబు, నేను అసెంబ్లీలో స్పష్టం చేశాం. ప్రజా జీవితంలో ఉన్నవారు తమను తాము నియంత్రించుకోవాలి. ఉద్యోగుల విధి నిర్వహణను ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించొద్దు’ అని ఆయన ట్వీట్ చేశారు.
News August 21, 2025
ఆగస్టు 21: చరిత్రలో ఈ రోజు

1914: సంగీత దర్శకుడు పి.ఆదినారాయణరావు జననం
1963: నటి రాధిక జననం
1978: భారత మాజీ క్రికెటర్ వినూ మన్కడ్ మరణం
1978: నటి భూమిక చావ్లా జననం
1986: జమైకన్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ జననం
1998: హీరోయిన్ డింపుల్ హయాతి జననం
2013: ‘సాహిత్య అకాడమీ’ గ్రహీత మాలతీ చందూర్ మరణం
* జాతీయ వృద్ధుల దినోత్సవం