News September 27, 2025

నేటి ముఖ్యాంశాలు

image

*MiG-21 ఎయిర్‌క్రాఫ్ట్స్‌కు IAF ఘనంగా వీడ్కోలు
*15 నెలల్లో 4,71,574 మందికి జాబ్స్: చంద్రబాబు
*APలో నాలా చట్టం రద్దు బిల్లుకు శాసన సభ ఆమోదం
*TG నూతన DGPగా శివధర్ రెడ్డి నియామకం
*TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ GO
*7 భారత ఫైటర్ జెట్లు కూల్చేశాం: పాక్ ప్రధాని
*ఫార్మా దిగుమతులపై 100% టారిఫ్: ట్రంప్
*సూర్యకుమార్, రవూఫ్‌కు మ్యాచ్ ఫీజులో 30% కోత

Similar News

News February 12, 2026

విటమిన్ Cతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలు

image

స్త్రీలకు విటమిన్ C ఎంతో ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఇది స‌రిగ్గా ల‌భించ‌క‌పోతే స్త్రీల‌కు డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. C విటమిన్‌తో కొల్లాజెన్ ఉత్ప‌త్తి పెరిగి వృద్ధాప్య ఛాయ‌లు తగ్గుతాయి, ప్రెగ్నెన్సీలో తీసుకుంటే శిశువులో పుట్టుకలోపాలు రాకుండా ఉంటాయి, ఈస్ట్రోజ‌న్ స్థాయిలు పెరుగుతాయి. దీని వ‌ల్ల హార్మోన్ స‌మ‌స్య‌లు, గ‌ర్భాశ‌య స‌మ‌స్య‌లు ఉండ‌వు. కాబట్టి ఇది తగినంత అందేలా చూసుకోవాలంటున్నారు.

News February 12, 2026

చేతులు, కాళ్లు కట్టేసి.. బంగ్లాలో హిందూ యువకుడి హత్య

image

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతడిని మౌల్విబజార్‌లోని చంపా ప్రాంతంలో టీ తోటల్లో పని చేసే రతన్ సహువాకర్‌(28)గా గుర్తించారు. రతన్ చేతులు, కాళ్లు కట్టేశారని, శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని తెలుస్తోంది. రక్తపు మడుగులో ఉన్న డెడ్‌ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో హత్య జరిగిందా, ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

News February 12, 2026

ఎవరికి ఎంత విటమిన్ C కావాలంటే?

image

మహిళలు విట‌మిన్ C ఉండే ఆహారాల‌ను రోజూ తినాల్సి ఉంటుంది. మహిళలకు రోజుకు 75 మిల్లీగ్రాముల మోతాదులో విట‌మిన్ C అవ‌సరం అవుతుంది. గర్భిణులకు 85 mg, బాలింతలకు 120 mg అవసరమని నిపుణులు చెబుతున్నారు. ట‌మాటా, కివీ, క్యాబేజీ, నారింజ‌, నిమ్మ‌, ఉసిరి, క్యాప్సికం, అర‌టి పండ్లు, బెర్రీలు, పైనాపిల్‌, జామ, బొప్పాయి, ద్రాక్ష‌, దానిమ్మ‌, ప‌చ్చి బ‌టానీలు, మ్యాంగో ద్వారా విట‌మిన్ Cని పొందొచ్చని సూచిస్తున్నారు.