News October 5, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* AP: ఆటో డ్రైవర్ల ఖాతాల్లో రూ.15 వేలు జమ
* కూటమి నేతలతో కలిసే వెళ్లాలి: పవన్
* TG: బీసీలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్
* HYD, SEC పరిధిలో ఛార్జీలు పెంచిన TGSRTC
* అన్ క్లెయిమ్డ్ మొత్తం ₹1.84 లక్షల కోట్లు: నిర్మల
* ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ
* టీమ్ ఇండియా వన్డే కెప్టెన్‌గా గిల్
* తొలి టెస్టులో విండీస్‌పై భారత్ విజయం

Similar News

News March 23, 2026

ఒకే రోజు రూ.10,320 తగ్గిన 10గ్రాముల బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవాళ <<19453496>>మరోసారి<<>> భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.10,320 తగ్గి రూ.1,35,650కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.9,450 పతనమై రూ.1,24,350 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,30,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.

News March 23, 2026

3లక్షల మందికి పైగా భారత్‌కు తిరిగొచ్చారు: PM మోదీ

image

పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు యుద్ధ ప్రభావిత దేశాల నుంచి 3 లక్షల మందికి పైగా భారత్‌కు తిరిగొచ్చారని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇందులో ఇరాన్ నుంచి వచ్చిన వారు 1000 మంది ఉన్నట్లు లోక్‌సభలో పేర్కొన్నారు. ఈ యుద్ధం వల్ల భారత్ అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని చెప్పారు. గల్ఫ్ దేశాల్లో కోటి మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారని, వారి భద్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

News March 23, 2026

అమరావతి అప్పులు భూములు అమ్మి తీరుస్తాం: నారాయణ

image

AP: రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. ‘అమరావతిని ప్రభుత్వం ఎలా పూర్తి చేయగలదనే భ్రమల్లో YCP నేతలున్నారు. రాజధానిలోని నిర్మాణాలు మామూలువి కాదు ఐకానిక్ భవనాలు. ప్రపంచంలోనే అత్యద్భుతమైన అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తున్నాం. అమరావతి నిర్మాణానికి అయ్యే అప్పుల్ని భూముల అమ్మకాల ద్వారా తీరుస్తాం’ అని మంత్రి వివరించారు.